epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పల్లెల్లో పత్తాలాట జోరు

పల్లెల్లో పత్తాలాట జోరు
పక్కా నెట్‌వర్క్‌తో పేకాట దందా!
ఏటూరునాగారం మండలంలో సీక్రెట్‌గా పేకాట కేంద్రాలు
దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న జూదరులు
పోలీసుల కళ్లుగప్పేందుకు ప్రత్యేకంగా ‘ఎస్కార్ట్’ టీంలు
యువతను బలి తీసుకుంటున్న వ్యసనం
రోడ్డున పడుతున్న కుటుంబాలు
నెలవారీ మామూళ్లతోనే అధికారులు మౌనం?

కాకతీయ, నిఘా ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొన్ని గ్రామాల్లో పేకాట డెన్‌లు నిర్విరామంగా కొన‌సాగుతున్నాయి. పల్లెల్లో పత్తాలాట జోరుగా సాగుతుండటంతో సామాన్య కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంతో పాటు ముళ్లకట్ట, రామ్ న‌గర్, శంకర్ రాజ్‌పల్లి, రోయ్యూర్ గ్రామాల్లో పేకాట రాయుళ్లు అడ్డుఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ జూద క్రీడ సాగుతున్నప్పటికీ, అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ భవనంలో బహిరంగంగానే పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే ఓడవాడలోని కరకట్ట సమీపంలో ఉన్న గుడిసెలు, రామ్‌న‌గర్ గోదావరి కరకట్ట, ముళ్లకట్ట – రాంపూర్ సరిహద్దులు పేకాట అడ్డాలుగా మారాయి. ఇక్కడ ప్రతి గేమ్‌పై వేల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు ప్రతి గేమ్‌కు కమిషన్ వసూలు చేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల నుంచే కాకుండా పక్క మండలాల నుంచి కూడా జూదరులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.

ఎస్కార్ట్ టీంలతో పక్కా నిఘా

పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిర్వాహకులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. జూద కేంద్రాలకు కిలోమీటర్ దూరంలోనే ‘ఇన్ఫార్మర్ల’ను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఎస్కార్ట్ టీంలకు రోజువారీగా రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు కూలీ చెల్లిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా పోలీసులు అటువైపు వస్తే వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక జూదరులకు మద్యం, సిగరెట్లు, గుట్కాలు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసి విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

బల‌వుతున్న యువత.. కునారిల్లుతున్న కుటుంబాలు

ఈ జూద వ్యసనానికి ఎక్కువగా యువకులే బానిసలవుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును పేకాటలో పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. ఇటీవల మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న యువకుడి కోసం అతని కుటుంబ సభ్యులు వచ్చి నిర్వాహకులతో ఘర్షణ పడినట్లు సమాచారం. అయినా నిర్వాహకులు ఒక్క రోజు బ్రేక్ ఇచ్చి, మరుసటి రోజు నుండే మళ్లీ యథావిధిగా దందాను కొనసాగిస్తున్నారు. పరువు పోతుందనే భయంతో చాలా కుటుంబాలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నాయి. పేకాట నిర్వాహకుల నుంచి అధికారులకు భారీగా మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఏటూరునాగారం మండలంలో పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.