epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ ప‌ట్టివేత‌

రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ ప‌ట్టివేత‌
అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు ర‌ట్టు.. నలుగురు నిందితుల అరెస్ట్
నిందితుల నుంచి 20 కిలోల గంజాయి లిక్విడ్ స్వాధీనం
ముంబైకి తరలిస్తుండగా వరంగల్ పోలీసుల ఆపరేషన్
వివ‌రాల‌ను వెల్ల‌డించిన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

కాకతీయ, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారని, నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 2.5 కోట్ల రూపాయల విలువ గల 20 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హంటల్ సన్ను, హంటల్ సన్యాసి, కండెల చిన్నబాబు, కృష్ణా హంటల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు సన్ను తన గ్రామంలో గంజాయి సాగు చేసి విక్రయించేవాడని, అయితే అధిక ఆదాయం కోసం హాష్ ఆయిల్ తయారీకి మళ్లాడని పేర్కొన్నారు. పరారీలో ఉన్న ప్రధాన కుట్రదారుడు కిలో పాండు సూచనల మేరకు ప్రత్యేక పరికరంతో గంజాయి మొక్కల నుండి సుమారు 40 కిలోల హాష్ ఆయిల్ తయారు చేశారని వివరించారు. ఇందులో 20 కిలోలు పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోలను నిందితులు ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున పంచుకుని ముంబైలో విక్రయించేందుకు ప్లాన్ చేశారని తెలిపారు.

అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల వలలో

ఈ నెల 19న తుని రైల్వే స్టేషన్ నుండి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభించిన నిందితులు, వరంగల్ వద్ద తనిఖీలు జరుగుతున్నాయనే అనుమానంతో రైలు దిగిపోయారని సీపీ తెలిపారు. అనంతరం ముంబై వెళ్లేందుకు బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తనిఖీల్లో నిందితుల వద్ద హాష్ ఆయిల్ బయటపడిందని, పరారీలో ఉన్న పాండు కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సెంట్రల్ జోన్ డీసీవో దార కవిత, ఏసీవోలు, ఇన్‌స్పెక్టర్లు మరియు సిబ్బందిని కమిషనర్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే...

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ :...

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?

ఏళ్లు గడుస్తున్నా...మూత్రశాలలు ఏవి సామీ? తీరని బస్ స్టాండ్  కష్టాలు.. చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ...

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.