epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డీఎల్‌ఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

డీఎల్‌ఈడీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏజెన్సీ గిరిజన అభ్యర్థులకు సువర్ణావకాశం
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్

కాకతీయ, కొత్తగూడెం : 2026-28 విద్యా సంవత్సరమునకు గాను భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన డీఎల్‌ఈడీ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం తెలుగు మీడియం 12వ బ్యాచ్ రెగ్యులర్ కోర్సులో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్మీడియట్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని పీవో బి. రాహుల్ వివరించారు. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాలకు చెందిన గిరిజన అభ్యర్థులై ఉండాలని, మే లేదా జూన్ 2026 నాటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మహిళలకు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు సీట్ల రిజర్వేషన్లు వర్తిస్తాయని, పూర్తి పారదర్శకంగా మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు.

ఉచితంగా దరఖాస్తుల పంపిణీ

ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఏటూరునాగారం, ఉట్నూర్, మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాలతో పాటు భద్రాచలం గిరిజన డీఎల్‌ఈడీ కళాశాలలో దరఖాస్తులు, ప్రాస్పెక్టస్‌ను ఉచితంగా పొందవచ్చని పీవో తెలిపారు. పోస్టు ద్వారా దరఖాస్తులు పొందగోరే వారు 10 రూపాయల స్టాంపుతో కూడిన స్వంత చిరునామా గల కవరును ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలం చిరునామాకు పంపాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 11వ తేదీలోపు సమర్పించాలని, అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9959575539, 8639084543, 8309972776 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.