epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మంకు ‘కృష్ణ’ కటాక్షం..

ఖమ్మంకు ‘కృష్ణ’ కటాక్షం..
ఇస్కాన్ ఆలయానికి కేబినెట్ ఆమోదం!
రఘునాథపాలెంలో సుమారు 5 ఎకరాల భూమి కేటాయింపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి తుమ్మల కృతజ్ఞతలు
ఖమ్మంలో ఆధ్యాత్మిక వైభవానికి నాంది
మంత్రి కృషితో రూపుదిద్దుకుంటున్న సమగ్ర సేవా–సాంస్కృతిక వేదిక
శ్రీకృష్ణ భక్తి మార్గంతో పాటు సామాజిక సేవలకు నిలయం
యువతకు యోగా, ధ్యానం.. విద్యార్థులకు భగవద్గీత బోధన
సహజ వ్యవసాయం, గో సంరక్షణే లక్ష్యంగా మహా ప్రాజెక్టు

కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. ఇస్కాన్ సొసైటీ ఆధ్వర్యంలో బలరామకృష్ణ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రఘునాథపాలెం మండలం పరిధిలో సుమారు 4 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమిని ఇస్కాన్ సంస్థకు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రెవెన్యూ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లింపుపై ఈ భూమిని కేటాయించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహచర మంత్రివర్గానికి తుమ్మల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆధ్యాత్మిక–సేవా కేంద్రంగా ఇస్కాన్ ప్రాజెక్టు
ఖమ్మంలో నిర్మితమవుతున్న ఇస్కాన్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది భక్తి, విద్య, సేవ, గ్రామీణాభివృద్ధి అన్న నాలుగు స్తంభాలపై నిలబడే సమగ్ర ప్రాజెక్టు. వేద శిల్పకళా సౌందర్యంతో శ్రీ శ్రీ బలరామ–కృష్ణ ఆలయాన్ని నిర్మించనున్నారు. నగర జీవన ఒత్తిడిలో మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఆధ్యాత్మిక ఆశ్రయంగా మారనుంది. ఇక్కడ నిర్వహించే నిత్య పూజలు, ఉత్సవాలు భవిష్యత్తులో పర్యాటక రంగానికి కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, వ్యసనాలకు యోగా, ధ్యానం, సాత్విక ఆహారం ద్వారా వేద పరిష్కార మార్గాలు చూపాలని ఇస్కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఆదివారం విద్యార్థుల కోసం భగవద్గీత తరగతులు, వేసవి శిబిరాలు నిర్వహించి నైతిక విలువలను పెంపొందించనున్నారు. వీటితో పాటు మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. నిత్య అన్నదాన సేవ ద్వారా ఆకలి నిర్మూలనకు ఈ కేంద్రం వేదిక కానుంది.

సహజ వ్యవసాయం.. గో సంరక్షణ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గోశాల ఏర్పాటు చేసి గో సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రసాయనాలు లేని సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. గో-ఉత్పత్తులు, ఆర్గానిక్ వ్యవసాయాన్ని అనుసంధానం చేయడం ద్వారా రైతులకు ఆర్థిక స్వయం సమృద్ధిని చేకూర్చాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అల్లీపురంలో ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం సాగుతుండగా, ఇప్పుడు రఘునాథపాలెంలో ఇస్కాన్ ఆలయం కూడా తోడవడంతో ఖమ్మం జిల్లా రాష్ట్ర స్థాయిలోనే ప్రముఖ ఆధ్యాత్మిక–సేవా హబ్‌గా రూపాంతరం చెందనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.