epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్యాస్ క‌ష్టాలు

గ్యాస్ క‌ష్టాలు
అర్ధరాత్రి నుంచే క్యూలైన్లు..
నర్సింహులపేటలో వినియోగదారుల ధర్నా
ఏజెన్సీల ఎదుట బారులు తీరిన జనం
బుకింగ్ చేసినా అందని సిలిండర్లు
జాతీయ రహదారిపై రాస్తారోకో.. నిలిచిన రాకపోకలు

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. సకాలంలో గ్యాస్ అందక, ఏజెన్సీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు శనివారం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సిలిండర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ ఎదుట అర్ధరాత్రి నుంచే మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో బారులు తీరారు. సిలిండర్లు దొరుకుతాయో లేదో అన్న ఆందోళనతో చాలామంది ఏజెన్సీ కార్యాలయం ముందే పడుకున్నారు. తెల్లవారినా ఏజెన్సీ నిర్వాహకులు కార్యాలయానికి రాకపోవడం, వచ్చిన తర్వాత కూడా స్టాక్ లేదని చెప్పడంతో వినియోగదారుల ఓపిక నశించింది.

బుకింగ్ చేసినా దక్కని వైనం
చాలామంది వినియోగదారులు తాము ఎన్నో రోజుల క్రితమే గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసుకున్నామని, అయినా సమయానికి సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని, పదేపదే తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. గ్యాస్ కొరత కారణంగా వంట చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కట్టెల పొయ్యిలపై ఆధారపడాల్సి వస్తోందని మహిళలు వాపోయారు.

రహదారిపై ధర్నా.. వాహనాల నిలిచివేత
సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహించిన వినియోగదారులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా సిలిండర్లు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందిించి గ్యాస్ కొరతను తీర్చాలని, ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వినియోగదారులతో చర్చలు జరుపుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.