epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు..

నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు..
1:3 ఆఫర్ పేరుతో భారీ మోసం
ల్యాప్‌టాప్‌లు ప్రింటర్లతో వంద రూపాయల నకిలీ నోట్ల ముద్రణ
బ్లాక్ మనీని అసలు నోట్లుగా మారుస్తామంటూ రసాయనాలతో మాయాజాలం
నిందితుల నుంచి 28 లక్షల రూపాయల విలువైన సామగ్రి స్వాధీనం
ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో పలువురిని ముంచిన కేటుగాళ్లు
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

కాకతీయ, వరంగల్ బ్యూరో : నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి మార్కెట్లో చలామణి చేస్తున్న గ్యాంగ్‌పై వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. నర్సంపేటకు చెందిన ముగ్గురు నిందితులు ల్యాప్‌టాప్‌, ప్రింటర్ల సహాయంతో అసలు రూ.100 నోట్లను కలర్ ప్రింట్ తీసి నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్నారు. మరో ఐదుగురు నిందితులు తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు ఇస్తామంటూ 1:3 నిష్పత్తి ఆశచూపి ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు.

రసాయనాలతో నోట్ల మాయ
ఈ మోసంలో భాగంగా నిందితులు అసలు రూ.500 నోట్లను రసాయన ద్రావణాల్లో ముంచి నల్లగా మార్చి, తిరిగి అవి అసలు రూపంలోకి వస్తాయని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నల్ల కాగితాలను నోట్లుగా చూపిస్తూ మాయాజాలం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, 1.48 లక్షల అసలు నగదుతో పాటు సుమారు 28 లక్షల రూపాయల విలువైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, 13 సెల్‌ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో శాగంటి కిరణ్‌, నీరటి శివ, నీరటి రంజిత్‌, గుడికందుల రవి, పోరిక రాజ్‌కుమార్‌, తనమాల రాజశేఖర్‌, ముదురుకోల యాకంబరం, చేను సాయికిరణ్ ఉన్నారు.

పాత నేరస్థులే..
అరెస్టైన వారు నర్సంపేట, ములుగు, ఖమ్మం, భువనగిరి, కొత్తగూడెం ప్రాంతాలకు చెందినవారని డీసీపీ వివరించారు. ఈ గ్యాంగ్ గతంలో ములుగు ఘన్‌పూర్‌, సికింద్రాబాద్ మోండా మార్కెట్‌, కొత్తగూడెం, కాకతీయ యూనివర్సిటీ, సుబేదారి తదితర ప్రాంతాల్లో మోసాలకు పాల్పడి కేసులు ఎదుర్కొన్నట్లు విచారణలో తేలింది. తాజాగా హైదరాబాద్‌ చత్రినాక, నర్సంపేట ప్రాంతాల్లో కూడా మోసాలు చేసినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మదుసూధన్‌, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు బాబులాల్‌, శ్రీనివాస్‌ సహా పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.