epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆత్మకూరు కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త పోరు

ఆత్మకూరు కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త పోరు
పార్టీ మండల అధ్యక్షుడిగా ఇటీవ‌ల‌ రేవూరి జలంధర్ రెడ్డి నియామ‌కం
సభ్యత్వం లేని వారికే కీలక బాధ్యతలిస్తారంటూ కొంత‌మంది ఆగ్ర‌హం
సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు తెర‌లేపుతూ.. నిర‌స‌న స్వ‌రాలు
కష్టపడ్డ కార్యకర్తల్లో పెల్లుబుకుతున్న తీవ్ర నైరాశ్యం
పదేళ్ల పోరాటానికి ఫ‌లితం ద‌క్క‌డం లేదంటూ ఆవేద‌న‌
బంధుప్రీతి, సామాజిక వివక్షపై శ్రేణుల నిరసన
సమీకరణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన
రాష్ట్ర, జిల్లా నాయకత్వ జోక్యం కోరుతున్న కేడర్

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయితీ ముదిరింది. ఇటీవల జరిగిన నియామకాలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్ణయాలపై పార్టీ శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మండల పార్టీ అధ్యక్షుడిగా రేవూరి జలంధర్ రెడ్డిని నియమించడం, జిల్లా కమిటీలో రేవూరి రణధీర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంపై సీనియర్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీసి, పార్టీ అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది.

త్యాగాలకు దక్కని ఫలితమంటూ ఆవేద‌న‌

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఇప్పుడు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులను ఎదుర్కొని గ్రామ స్థాయిలో పార్టీని కాపాడిన వారిని పక్కన పెట్టి, పార్టీలో చురుకుగా లేని వారికి పదవులు కట్టబెట్టడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన మాకు దక్కిన గుర్తింపు ఇదేనా?” అని వారు ప్రశ్నిస్తున్నారు.

సభ్యత్వం లేని వారికి పట్టం?

జిల్లా స్థాయిలో పదవి పొందిన రేవూరి రణధీర్ రెడ్డికి అసలు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ఏనాడూ పాల్గొనని వ్యక్తికి కీలక బాధ్యతలు ఇవ్వడం వెనుక కేవలం బంధుప్రీతి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి తన సొంత వర్గానికి, బంధువులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కష్టపడిన బహుజన వర్గాల నాయకులను విస్మరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మండల, జిల్లా స్థాయి నియామకాల్లో సామాజిక సమతౌల్యం పూర్తిగా లోపించిందని కార్యకర్తలు ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమైన సామాజిక న్యాయం ఆత్మకూరులో అమలు కావడం లేదని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బహుజనులకు మరో న్యాయమా అని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీ మనుగడకు చేటు తెస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆత్మకూరు కాంగ్రెస్‌లో సెగలు రేపుతున్న ఈ అసంతృప్తిపై జిల్లా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి తక్షణమే స్పందించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పదవుల కేటాయింపును పునర్విమర్శించి, నిజాయితీగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో గ్రామ స్థాయిలో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.