సోషల్ మీడియాలో మాజీ సర్పంచ్ బూతు పురాణం
ముస్త్యాల గ్రామస్థులపై అసభ్యకర వ్యాఖ్యలు..
పెడతాల ఎల్లారెడ్డి తీరుపై ఆగ్రహం
కాకతీయ, చేర్యాల : సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో గ్రామస్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పెడతాల ఎల్లారెడ్డిపై ముస్త్యాల గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్త్యాల బీఆర్ఎస్ గ్రామ వాట్సాప్ గ్రూపులో ఆయన అసభ్యకరమైన రాతలతో మెసేజ్లు పోస్ట్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ‘వలగర్’ లాంగ్వేజ్ ఉపయోగించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఎల్లారెడ్డిని వివరణ కోరగా.. ఆ మెసేజ్లు పెట్టింది నిజమేనని ఆయన అంగీకరించడం గమనార్హం. నీలిమ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే ఇలాగే సమాధానం ఇస్తానని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. విమర్శలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు రాతలు రాయడంపై గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలో మాజీ సర్పంచ్ పెడతాల ఎల్లారెడ్డి వ్యాఖ్యలపై ముస్త్యాల గ్రామ ప్రజలు మరియు స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్చించుకుంటున్నారు.

