epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బంగారం దొంగ‌లు చిక్కారు

బంగారం దొంగ‌లు చిక్కారు
పీఎంజీ దొంగ‌త‌నం కేసును చేధించిన క‌రీంన‌గ‌ర్ పోలీసులు
ముఠాలోని ముగ్గురు స‌భ్యుల అరెస్టు.. మ‌రో ఇద్ద‌రు పరారీలోనే
బీహార్‌ జైలు నుంచే ‘గోల్డెన్‌ థీఫ్‌’ ఆపరేషన్
రెండు నెలల ముందే రాష్ట్రంలో రెక్కీ
మహారాష్ట్ర నుంచి తుపాకుల సేకరణ
సినిమా ఫక్కీలో కాల్పులు.. బైకులు వదిలి గోదావరి దాటి పరార్‌
దొంగల‌ను వెంటాడి.. వేటాడిన క‌రీంన‌గ‌ర్ పోలీసింగ్

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ నగరాన్ని వణికించిన ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో కీలక నిందితుడితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేయగా, అంతర్‌రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న కరుడుకట్టిన దోపిడీ ముఠా గుట్టురట్టు అయింది. బీహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’ సుభోద్ సింగ్ ఈ మొత్తం ఆపరేషన్‌కు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యువెలరీ షాపులో ఈ నెల 3వ తేదీన ఘోర దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు ఆయుధాలతో చొరబడి 101.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలను దోచుకెళ్లారు. వీటి మొత్తం విలువ రూ. 82.02 లక్షలుగా పోలీసులు గుర్తించారు. దోపిడీ సమయంలో షాప్ సిబ్బంది ప్రతిఘటించడంతో నిందితులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉద్యోగులు గాయపడ్డారు. బీహార్ జైలులో ఉన్న సుభోద్ సింగ్ ఆదేశాల మేరకు ఈ ముఠా రెండు నెలల క్రితమే తెలంగాణకు చేరుకుంది. జార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ. 10 వేల చొప్పున కొనుగోలు చేశారు. దొంగతనాలకు నకిలీ గుర్తింపు కార్డులు, తప్పుడు పేర్లతో లాడ్జ్‌లలో బస చేయడం ఈ గ్యాంగ్ స్టైల్. ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులపై రెక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్‌లోని పీఎంజే షాప్‌ను లక్ష్యంగా ఎంచుకుని ధర్మపురిలోని ఒక గెస్ట్ హౌస్‌లో బస చేసి దోపిడీకి వ్యూహం రచించారు.

కాల్పుల అనంత‌రం గోదావ‌రి నుంచి ఎస్కేప్‌..!

సుభోద్ సింగ్ అనుచరుల సూచనల మేరకు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి, అక్కడ నుంచి రైలులో మహారాష్ట్రలోని చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, మ్యాగజైన్లు స్వీకరించి ధర్మపురికి తిరిగి వచ్చినట్లు విచారణలో తేలింది. మే 3వ తేదీ ఉదయం నిందితులు రెండు బైక్‌లపై బయలుదేరి వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద బైక్ నంబర్ ప్లేట్లు మార్చారు. ఉదయం 10:50 గంటలకు షాపునకు చేరుకుని, కస్టమర్లలా లోపలికి వెళ్లి సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. నగలు దోచుకుంటుండగా సిబ్బంది ఎదురుతిరగడంతో కాల్పులు జరిపి ఒక ఆభరణాల బ్యాగ్‌తో పరారయ్యారు. కంగారులో మరో బ్యాగ్‌ను షాపులోనే వదిలేశారు. అనంతరం గోదావరి నది ఒడ్డున బైక్‌లను వదిలి, నడుచుకుంటూ నది దాటి మంచిర్యాల నుంచి రైళ్లలో వివిధ రాష్ట్రాలకు పారిపోయారు.

వెలిచాల వద్ద నిందితుడి అరెస్ట్.. పోలీసుల హెచ్చరికలు

ఈ కేసులో ప్రధాన నిందితుడైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్‌ను మే 13 సాయంత్రం వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇతనిపై వివిధ‌ రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, ఆయుధ చట్టాల కింద ఇప్పటికే 7 కేసులు ఉన్నాయి. మరో ఇద్దరు నిందితులు రావిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ (ఇతనిపై 15 కేసులు ఉన్నాయి), మెహతాబ్ ఖాన్‌లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు. సాంకేతిక నిఘా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటివరకు ఈ కేసులో 13 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ముగ్గురి వద్ద నుంచి రూ. 51 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్‌తో పాటు పరారీలో ఉన్న మిగిలిన నిందితులు, బంగారం రికవరీ కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జ్యువెలరీ షాపులు, బ్యాంకులు, లాడ్జ్‌ల యజమానులు తప్పనిసరిగా నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. లాడ్జ్‌లలో సరైన గుర్తింపు కార్డుల ధృవీకరణ తర్వాతే గదులు ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.