epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెరువులపై మట్టి మాఫియా దండయాత్ర

చెరువులపై మట్టి మాఫియా దండయాత్ర
చొప్పదండి నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా మ‌ట్టి అక్ర‌మ దందా
కోట్ల విలువైన మ‌ట్టిని కొట్టుకుపోతున్న మాఫియా కేటుగాళ్లు
ఇటుక బట్టీలకు చెరువు మట్టి.. ఒక్కో ట్రిప్పును వేల‌ల్లో విక్ర‌యం 
గుమ్మాళాపూర్‌లో అటవీ భూముల్లోనూ తవ్వకాలు
ఫిర్యాదులందినా మౌనం వ‌హిస్తున్న అధికారులు
దందాకు పూర్తిగా అధికారుల దండ‌లున్న‌ట్లుగా ప్రచారం
రూపురేఖలు కోల్పోతున్న జలాశయాలు.. రైతాంగం తీవ్ర ఆందోళన
కాకతీయ, కరీంనగర్ /చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు సైతం మట్టి మాఫియా కబంధహస్తాల్లో చిక్కుకున్నాయి. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి యంత్రాలతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల రాయల్టీ ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువులు లేదా ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలించాలంటే గనులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అనుమతులు తప్పనిసరి. కానీ చొప్పదండి నియోజకవర్గంలో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక ట్రాక్టర్ మట్టికి అనుమతి తీసుకుని వంద రెట్లు అధికంగా మట్టిని తరలిస్తున్నట్లు చెబుతున్నారు.
          గుమ్లాపూర్ పెద్ద చెరువు… మట్టి తవ్వకాలు..
ఇటుక బట్టీలకు చెరువు మట్టి
అక్రమంగా తవ్విన చెరువు మట్టిని ప్రధానంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చొప్పదండి పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల నిర్వాహకులతో మట్టి మాఫియా భారీ ఒప్పందాలు కుదుర్చుకుందని సమాచారం. చెరువులోనే లారీలు, టిప్పర్లు లోడ్ చేసి ఇచ్చినందుకు ఒక్కో ట్రిప్పుకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు వందలాది ట్రిప్పులు సాగుతుండటంతో ఈ దందా కోట్ల టర్నోవర్‌కు చేరిందని ప్రచారం జరుగుతోంది. చొప్పదండి మండలంలోని కాట్నపల్లి, దేశాయిపేటతో పాటు గంగాధర మండలం కురిక్యాల గ్రామాల్లో చెరువులు రూపురేఖలు కోల్పోతున్నాయి. చెరువుల లోతు అసహజంగా పెరగడంతో వర్షాకాలంలో కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
        గుమ్మాళాపూర్‌లో ఫారెస్ట్ లో మట్టితవ్వకాలు..
అటవీ భూములపైనా తవ్వకాలు
చొప్పదండి మండలంలోని గుమ్మాళాపూర్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సుమారు ఐదు ఎకరాల అటవీ భూమిలో అనుమతులు లేకుండానే చెట్లను నరికివేసి మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పచ్చని చెట్లను కూల్చి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నా అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన గ్రామస్తులను మాఫియా ముఠాలు బెదిరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాకు పెద్దల అండ ఉంది, ఎక్కడ చెప్పుకున్నా ఏమీ చేయలేరు అంటూ బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
అధికారుల మౌనం.. ప్రజాప్రతినిధుల అండ
మట్టి దందా వెనుక ఓ సిండికేట్ వ్యవస్థ పనిచేస్తోందన్న చ‌ర్చ‌ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. స్థానిక పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే భారీగా మట్టి తరలింపులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ చెరువులో తవ్వకాలు జరపాలన్నా ముందుగా రాజకీయంగా గ్రీన్ సిగ్నల్ తీసుకోవాల్సిందేనన్న ప్రచారం కూడా సాగుతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిన తర్వాతే జేసీబీలు రంగంలోకి దిగుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ಅక్రమ మట్టి తవ్వకాల వల్ల భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ లోడుతో వెళ్లే లారీలు, టిప్పర్ల కారణంగా గ్రామీణ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధూళి కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుమ్మాళాపూర్, కాట్నపల్లి, దేశాయిపేట, కురిక్యాల గ్రామాల్లో జరిగిన తవ్వకాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.