epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వేసిన తాళం వేసినట్టే

వేసిన తాళం వేసినట్టే
ఎంజీఎంలో తెరుచుకోని ‘ఎర్ర పెట్టెలు’
అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపంతో మూలనపడిన ఫిర్యాదుల బాక్సులు!
రోగుల నుంచి ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌కు కలెక్టర్ సత్యశారద చొరవతో ఏర్పాటు
ఫిర్యాదులను పరిశీలించకుండా ఆసుపత్రి యంత్రాంగం నిర్ల‌క్ష్యం
ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో కిందిస్థాయి అధికారుల ఉదాసీనత
సమన్వయ లోపంతో ఆశించిన ఫలితం ఇవ్వని ఉత్తమ వినూత్న కార్యక్రమం

కాకతీయ, వ‌రంగ‌ల్ : వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యల తక్షణ పరిష్కారానికి ఏర్పాటు చేసిన వినూత్న ‘ఎర్ర పెట్టెలు’ (ఫిర్యాదుల బాక్సులు) ఆసుపత్రి అధికారుల సమన్వయ లోపంతో అలంకారప్రాయంగా మారిపోయాయి. జిల్లా కలెక్టర్ స‌త్య శార‌ద ప్రత్యేక చొరవతో సుమారు రూ.30 వేల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఏర్పాటు చేయించిన ఈ పెట్టెలను క్షేత్రస్థాయిలో క్రమబద్ధంగా పర్యవేక్షించడంలో ఆసుపత్రి యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు, సిబ్బంది జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రిని స్వయంగా సందర్శించి లోపాలను సరిదిద్దిన కలెక్టర్, రోగులు తమ ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా అన్ని వార్డుల్లో ఈ ఎర్రపెట్టెలను ఏర్పాటు చేయించారు. రోగుల నుండి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆసుపత్రి పనితీరును మరింత మెరుగుపరచడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.

అధికారుల ఉదాసీనత.. వేసిన తాళం వేసినట్టే!
కలెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పెట్టెలను ఏర్పాటు చేయించినప్పటికీ, క్షేత్రస్థాయిలోని ఆసుపత్రి అధికారులు వాటి నిర్వహణను పూర్తిగా విస్మరించారు. బాక్సులు ఏర్పాటు చేసి దాదాపు ఏడాది కావస్తున్నా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాటిని తెరిచి రోగుల ఫిర్యాదులను క్రోడీకరించిన దాఖలాలు లేవని ఆసుపత్రి సిబ్బంది ద్వారా తెలుస్తోంది. ఈ పెట్టెలను ఎవరు తెరవాలి? ఏ సమయానికి ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి? అనే నియమ నిబంధనలపై ఆసుపత్రి వర్గాలు స్పష్టత తెచ్చుకోకపోవడం, కిందిస్థాయి అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. తమ పరిధిలోని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా ఆసుపత్రి యంత్రాంగం చేతులెత్తేయడంపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫలితం ఇవ్వని ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం
జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఎన్ని కొత్త ప్రణాళికలు ప్రవేశపెడుతున్నా, స్థానిక అధికారుల పర్యవేక్షణా లోపం వల్ల అవి పేద రోగులకు చేరడం లేదు. ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్షలు, మందుల పంపిణీ, రక్త నిల్వల లభ్యత వంటి అంశాలపై రోగులు పడుతున్న ఇబ్బందులను ఈ పెట్టెల ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్నా.. అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడం గమనార్హం. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కలెక్టర్ చొరవతో వచ్చిన ఈ మంచి వ్యవస్థ గోడలకే పరిమితమైందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి, ఎర్ర పెట్టెల తాళాలు తీయించి, రోగుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.