epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

కాంగ్రెస్ క‌స‌ర‌త్తు
పార్టీ పున‌ర్నిర్మాణంపై మండ‌ల అధ్య‌క్షుల ఫోక‌స్‌
గ్రామ అధ్య‌క్షుల నియామ‌కానికి నేత‌ల ఆరా
పరకాల కాంగ్రెస్‌లో ‘స్థానిక’ సమరం
కమిటీల పునర్నిర్మాణం వెనుక అసలు వ్యూహం అదేనా?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పావులు
గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు
గ్రామ కమిటీల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో వేగంగా కదలికలు
అసంతృప్తులకు చెక్ పెట్టేలా సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన వారికి పార్టీ పదవులు..?
నియోజకవర్గంలో వర్గపోరు సెగలను తట్టుకుంటూ ఎమ్మెల్యే రేవూరి ముందుకు
పార్టీ జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకట్రామి రెడ్డితో క‌లిసి వ్యూహాత్మక అడుగులు

కాక‌తీయ‌, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతుంటాయి. ఇక్కడి పొలిటికల్ గ్రౌండ్ లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలు పన్నుతుంటాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా సమూల మార్పులు చేస్తూ పునర్నిర్మాణ కసరత్తును ముమ్మరం చేసింది. ఇటీవల కాలంలో ఇక్కడ నూతన మండల కమిటీల నియామకం పూర్తి కావడంతో ఊపు మీదున్న హస్తం పార్టీ శ్రేణులు, ఇప్పుడు గ్రామ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుతో పాటు గ్రామ అధ్యక్షుల ఎంపికపై పూర్తిస్థాయిలో కేంద్రీకరించాయి. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి కోటను క్లీన్ స్వీప్ చేయడమే ఏకైక లక్ష్యంగా అధికార పార్టీ అడుగులు వేస్తోంది.

క్షేత్రస్థాయిలో రేవూరి మార్క్ సోషల్ ఇంజినీరింగ్

పరకాలలో గత ఎన్నికల నాటి నుంచి కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్ ను చల్లబరిచేందుకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షులు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులను రంగంలోకి దించి గ్రామాల్లో విస్తృతంగా పర్యటింపజేస్తున్నారు. సీనియర్ నాయకులు, సాధారణ కార్యకర్తలను సమన్వయం చేస్తూ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. పరకాల నియోజకవర్గంలోని ఆయా గ్రామాల వారీగా ఉన్న సామాజిక సమీకరణాలను (సోషల్ ఇంజినీరింగ్) నిశితంగా పరిశీలిస్తూ, ఏ ఒక్క వర్గానికి అసంతృప్తి కలగకుండా కమిటీలలో సమతూకం పాటించేలా ఎమ్మెల్యే మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది.

ఓడిన వారికి ఊరట… అసంతృప్తులకు బ్రేక్

ఈ సంస్థాగత నియామకాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఒక సరికొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న కీలక నాయకులకు, అలాగే సుదీర్ఘకాలంగా జెండా మోస్తూ ఎలాంటి అధికారిక పదవులు లేని అసంతృప్త కార్యకర్తలకు ఈ గ్రామ కమిటీలలో అగ్ర ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉన్న అసంతృప్తి చల్లారడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరంతా మరింత కసితో పనిచేస్తారని నాయకత్వం భావిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనే బలమైన సంకేతాన్ని కేడర్ లోకి పంపడం ద్వారా ఎన్నికల సమరానికి శ్రేణులను సర్వసన్నద్ధం చేస్తున్నారు.

త్రిమూర్తుల వ్యూహం.. గులాబీ పార్టీకి చెక్ పెట్టేనా?

పరకాలలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామి రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అయూబ్ లతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి త్రిమూర్తుల్లా వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లా నాయకత్వం నిరంతరం ఇక్కడి పరిణామాలపై నిఘా ఉంచి, క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన పునాది వేస్తోంది. మండల కమిటీల నియామకంతో ఇప్పటికే శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, రాబోయే కొద్ది రోజుల్లో తుది గ్రామ కమిటీల ప్రకటన కూడా వెలువడితే రానున్న స్థానిక సంస్థల పోరులో ప్రతిపక్షాలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.