సిటీ న్యూరో వైద్య సేవలు ప్రశంసనీయం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయాని రాజేందర్ రెడ్డి
క్యాంపు ఆఫీసులో సిటీ న్యూరో సెంటర్ బ్రోచర్ ఆవిష్కరణ
కాకతీయ, హన్మకొండ : వైద్య సేవలలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సిటీ న్యూరో సెంటర్ “ఏ డికేడ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ న్యూరోసైన్సెస్ మరియు హార్ట్” పేరుతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిటీ న్యూరో ఆస్పత్రి గత పదేళ్లుగా వైద్య రంగంలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. హైదరాబాద్‌లోని మూడు బ్రాంచ్‌ల ద్వారా ఇప్పటివరకు సుమారు 7 లక్షల మందికి సేవలు అందించడమే కాకుండా, 18 వేలకుపైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం గొప్ప విజయమని కొనియాడారు. అత్యాధునిక శస్త్రచికిత్సలు నిర్వహిస్తూనే, పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్యం అందించడం అభినందనీయమన్నారు. ఈ సేవలు భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ కృష్ణారెడ్డి, జనరల్ మేనేజర్ పి.రాము, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

