epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం

పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ వీసీ
భారత్‌నెట్ నిధుల విడుదలపై చ‌ర్చ‌
టీ-ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణపై సుదీర్ఘ వివ‌ర‌ణ‌
తొలి విడతగా మూడు జిల్లాల్లో 3,089 గ్రామాల్లో కనెక్టివిటీ
స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి రేవంత్‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం అంతరాయం లేని హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. భారత్‌నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక అంశాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు. ఐటీ, సమాచార శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధ‌వారం సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను సత్వరం విడుదల చేయడం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు.

రింగ్ ఆర్కిటెక్చర్ విధానం

రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ విధానం వల్ల టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించేలా రింగ్ ఆర్కిటెక్చర్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఈ విధానం ద్వారా ఒక మార్గంలో నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇంటర్నెట్ సేవలు నిరంతరం కొనసాగుతాయి. మండలం నుండి గ్రామ పంచాయతీ వరకు ఉండే రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని ముఖ్యమంత్రి కోరగా, కేంద్ర మంత్రి సింధియా దీనిపై సానుకూలంగా స్పందించి, కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

మొదటి దశలో 3,089 గ్రామాలు

తొలి విడతలో భాగంగా గతంలో నెట్‌వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీని తక్షణమే పునరుద్ధరిస్తారు. భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద గ్రామాల‌ను అనుసంధానిస్తూనే, భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా అత్యుత్తమ ఫైబర్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నగర ప్రాంతాలతో సమానంగా పల్లెల్లోనూ సేవలు అందించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నాణ్యమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతను సాధించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని సింధియా స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.