epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మందకొడిగా నైరుతి రుతుపవనాలు

మందకొడిగా నైరుతి రుతుపవనాలు
రాష్ట్ర‌మంతా విస్తరణ ఆలస్యం అవుతోంది
తెలంగాణ అంతటా విస్తరించేందుకు ఇంకా నాలుగైదు రోజుల సమయం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడిగాలులతో పాటు మండుతున్న ఎండలు
ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
రేప‌టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : నైరుతి రుతుపవనాలు మందకొడిగా ముందుకు సాగడం వల్లే తెలంగాణ అంతటా విస్తరించడంలో ఆలస్యం అవుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రమంతా రుతుపవనాలు పూర్తిగా విస్తరించేందుకు ఇంకా నాలుగైదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ లోపు ఉత్తర భారతదేశం నుంచి ఉత్తర తెలంగాణలోకి వేడిగాలుల రాక ఇంకా కొనసాగుతుందని, దీనివల్ల అక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయని స్పష్టం చేశారు. అయితే మరో 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ, రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల ప్రస్తుతం దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయని, ఆ తర్వాత ఈ నెల 18 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

పది శాతం లోటు వర్షపాతం
నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించి జోగులాంబ గద్వాల జిల్లాను ఆవరించగా, ప్రస్తుతం హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ఉత్తర సరిహద్దు కొనసాగుతోందని శ్రీనివాస్ వివరించారు. దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు మధ్య తెలంగాణలోని వివిధ జిల్లాలను రుతుపవనాలు తాకాయన్నారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 10 శాతం లోటు ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ద్రోణి, అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈనెల 18 నుంచి కురిసే భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిరంతరం సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.