epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిలిచిన వాహన్ సారథి సేవ‌లు

నిలిచిన వాహన్ సారథి సేవ‌లు
ఆర్టీఏ కార్యాలయాల్లో పూర్తిగా స్తంభించిన సేవలు
రెండు రోజులుగా పనిచేయని సాఫ్ట్‌వేర్
వాహనదారులకు తప్పని సుదీర్ఘ నిరీక్షణ
సీజ్ చేసిన ట్రాక్టర్లు విడుదల కాక రైతుల ఇబ్బందులు
నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరిమానాల చెల్లింపులు
మా చేతిలో ఏమీ లేదంటూ చేతులెత్తేసిన రవాణా శాఖ అధికారులు
సాఫ్ట్‌వేర్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ వాహనదారుల డిమాండ్

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా వాహన్ సారథి పోర్టల్ కార్యకలాపాలు సాంకేతిక కారణాల వల్ల పూర్తిగా నిలిచిపోయాయి. నిన్నటి నుంచి రవాణా శాఖలో సారథి సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడంతో రెండు రోజులుగా ఆర్టీఏ సేవలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు వాహనదారులు భారీగా చేరుకోవడంతో సుదీర్ఘమైన క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. సమస్యపై అక్కడి అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సాంకేతిక సమస్య తమ చేతిలో లేదంటూ సంబంధిత రవాణా శాఖ అధికారులు చేతులెత్తేయడంపై వాహనదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నాలుగు రోజులుగా నిలిచిన పనులు

రెండవ శనివారం సెలవు కావడం, ఆపై సోమవారం నుండి సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడంతో గడిచిన నాలుగు రోజులుగా పనులన్నీ ఆగిపోయాయని వాహనదారులు వాపోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ను వెంటనే సవరించి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఈరోజు సమస్యను పరిష్కారం చేయాలంటూ కొన్ని చోట్ల కార్యాలయాల వద్ద అధికారులను వాహనదారులు వేడుకుంటున్నారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, పాత వాహనాల జరిమానాల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో అవసరానికి వాహనాలు అందుబాటులో లేక యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతన్నల ఆవేదన

మరోవైపు వివిధ కారణాల వల్ల అధికారులు సీజ్ చేసిన వాహనాల యజమానులకు ఈ సాఫ్ట్‌వేర్ సమస్య వల్ల మరిన్ని ఇబ్బందులు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన ట్రాక్టర్లు, ఇతర ట్రాలీ వాహనాలు విడుదల కాకపోవడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులకు అత్యంత కీలకమైన సమయంలో వాహనాలు పోలీస్ స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాలకే పరిమితమవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని ఆందోళన చెందుతున్నారు.

లగేజీ వాహనాలను విడుదల చేయాలని విజ్ఞప్తి

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంటే ముందుగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలు, ఇతరత్రా లగేజీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను సీజ్ నుండి విడుదల చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై రవాణా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సాఫ్ట్‌వేర్ లోపాలను సరిచేయాలని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయినా సీజ్ చేసిన వాహనాల విడుదలకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నిరసనలు, విజ్ఞప్తుల కార్యక్రమంలో వందలాది మంది రైతులు, లగేజీ వాహనదారులు, రవాణా రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.