epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అరుంధతి కళ్యాణ మండపం ప్రారంభ‌మెప్పుడు..?

అరుంధతి కళ్యాణ మండపం ప్రారంభ‌మెప్పుడు..?
నిర్మాణం పూర్తయి నాలుగేళ్లయినా వీడ‌ని సందిగ్ధం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసమని చెప్పి ఇప్పుడు పట్టించుకోరా?
అధికారుల మధ్య సమన్వయ లోపమా? ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా?

కాకతీయ, శంకరపట్నం : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనుక 500 సర్వే నంబర్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా నిర్మించిన ‘అరుంధతి కళ్యాణ మండపం’ నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేసిన ఈ భవనం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సామాజిక కార్యక్రమాలు, వివాహాలు, సమావేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అప్పట్లో ఘనంగా ప్రకటించారు. తీరా కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం పూర్తి చేసినా, దాన్ని ప్రజలకు అప్పగించడంలో పాలకులు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రారంభంలో జాప్యానికి కారణాలేంటి?

నిర్మాణ పనులు వంద శాతం పూర్తయినా ఇప్పటికీ మండపం తాళాలు తీయకపోవడం వెనుక అసలు కారణాలేంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందా? లేక ఇంకా ఏవైనా పరిపాలనా అనుమతుల సమస్యలు వేధిస్తున్నాయా? లేక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాల వారు శుభకార్యాలు జరుపుకోవడానికి వీలుగా నిర్మించిన ఈ భవనం వృథాగా దర్శనమిస్తుండటంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆలస్యానికి గల కారణాలను వెల్లడించాలని, అరుంధతి కళ్యాణ మండపాన్ని తక్షణమే ప్రారంభించి నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.