epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎంత‌సేపు జీఎంను లేపాలా.. ఎండీని లేపాలా…

ఎంత‌సేపు జీఎంను లేపాలా.. ఎండీని లేపాలా…

ఈ ఆలోచ‌న‌ల‌తో జీవితం నాశ‌న‌మ‌వుతోంది

ఇసుక కాంట్రాక్ట‌ర్ శ్రీక‌ర్‌తో అధికారి సంభాష‌ణ.. కాక‌తీయ చేతిలో ఆడియో ..!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మ‌ణుగూరు ఇసుక ర్యాంపుల్లో కొన‌సాగుతున్న అక్ర‌మాల్లో అధికారుల పాత్ర కీల‌క‌మ‌నే విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతోంది. కాంట్రాక్ట‌ర్ల‌తో అంట‌కాగుతూ..వారి క‌నుస‌న్న‌ల్లోనే అధికారులు ప‌నిచేస్తున్నార‌న‌డానికి కాక‌తీయ‌కు చిక్కిన ఆడియో ప్ర‌స్పుటం చేస్తోంది. ఇసుక ర్యాంపుల‌తో త‌న‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని వాదిస్తున్న శ్రీక‌ర్‌తో అధికారులు ఎంతో చ‌నువుగా సంభాషిస్తున్న ఆడియో కాక‌తీయ చేతికి చిక్కింది. టీజీఎండీసీ ఎండీని ఓ అధికారి చాలా చుల‌క‌న‌క‌గా మాట్లాడుతున్నట్లుగా ఆడియోలో నిక్షిప్త‌మై ఉంది. జీఎంను.. ఎండీల‌కు ఊడిగం చేయాలా… ఎంత సేపు ఈ ఆలోచ‌న‌ల‌తో జీవితం నాశ‌న‌మ‌వుతోందంటూ స‌ద‌రు అధికారి వ్యాఖ్య‌నిస్తున్న‌ట్లుగా ఆడియోలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

కాంట్రాక్ట‌ర్ శ్రీక‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారుల మ‌ధ్య ఈ సంభాష‌ణ జ‌రిగిన‌ట్లుగా ఉంది. దాదాపు ఎనిమిది నిముషాల పాటు ఉన్న ఆడియోలో క‌లెక్ట‌ర్‌, టీజీఎండీసీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంటు, పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారుల వ్య‌వ‌హార శైలిపై అధికారుల మ‌ధ్య చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంభాష‌ణ‌లో ఓ జిల్లా క‌లెక్ట‌ర్‌కు సంబంధించిన చాంబ‌ర్ విష‌యం.. ఫైల్ క్లియ‌రెన్స్ తాను తీసుకుంటున్న రిస్క్‌… స‌ద‌రు క‌లెక్ట‌ర్ రామ‌లక్ష్మ‌ణులుగా ఎలా త‌న చాంబ‌ర్‌లోకి త‌మ‌ను ఆహ్వానించే విష‌యాల‌ను ఇద్ద‌రు అధికారులు ముచ్చ‌టిస్తుండ‌గా..శ్రీక‌ర్ న‌వ్వుతున్న‌ట్లుగా ఆడియోలో రికార్డ‌యి ఉంది. లోడింగ్ అమౌంట్ గురించి ఒక లారీ ఓనర్ ఫోన్ చేస్తున్నాడు నేను లేపడం లేదని టీజీఎండీసీ అధికారి చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఈ సంభాష‌ణ‌లో శ్రీక‌ర్ అనుచ‌రుడు వాసు ప్ర‌స్తావ‌న సైతం ఉంది. క్వారీల్లో ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి.. వాసుతో రిస్క్ అవుతోందంటూ ఓ అధికారి శ్రీక‌ర్‌కు ఫిర్యాదు చేస్తున్న‌ట్లుగా కూడా ఉంది. శ్రీక‌ర్ ర్యాంపుల్లో వాసుయే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా కాక‌తీయ క‌థ‌నాల్లో స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. టీజీఎండీసీ కాంట్రాక్టర్లకు అధికారులకు కొమ్ము కాస్తున్నాడనే ఫిర్యాదు చేసినా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోక‌పోవ‌డంపై ఇప్పుడు అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. త‌న‌కు ఇసుక ర్యాంప్ లే లేవని అని చెప్పుకునే శ్రీకర్‌కు స‌ద‌రు టీజీఎండీసీ అధికారుల‌తో ఏం ప‌ని, స‌ద‌రు అధికారుల‌తో అంత చనువుగా ఎందుకు ఉంటాడన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.