epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మరోసారి ముల్కీ ఉద్యమం తప్పదు

మరోసారి ముల్కీ ఉద్యమం తప్పదు
ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ నేతల హెచ్చరిక!
మూడేళ్లు బీటెక్ చదివితే స్థానికులు ఎలా అవుతారు?
కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్
ఉద్యోగుల సభలో పీఆర్‌సీ, డీఏలపై సీఎం దాటవేత ధోరణి : భుజంగరావు

కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానికత నిబంధనల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్, బీఆర్‌ఎస్‌ నేత భుజంగరావు మాట్లాడారు. ఈ సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యురాలు ఉపేంద్ర చారి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి. దేవీప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేవలం 3 ఏళ్లు బీటెక్ చదివినంత మాత్రాన ఇతర రాష్ట్రాల వారిని స్థానికులుగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. పల్లా నిషాంత్ కేసులో వచ్చిన కోర్టు తీర్పు వల్ల తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తాము న్యాయస్థానం తీర్పును తప్పుబట్టడం లేదని, అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్టులో సరైన వాదనలు వినిపించడంలో మరియు కౌంటర్ దాఖలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల గతంలో ఆదిలాబాద్, కొమరం భీం వంటి వెనుకబడిన జిల్లాల యువత ఉద్యోగాలు కోల్పోయారని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా కఠిన నిబంధనలు తెచ్చిందని, 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన వారినే స్థానికులుగా గుర్తించేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ పౌరులు ఇతర రాష్ట్రాల్లో చదివితే అక్కడ స్థానికులుగా గుర్తించనప్పుడు, ఇక్కడ మాత్రం నిబంధనలు సడలించడం ఏంటని నిలదీశారు. ఇప్పటికైనా సాధారణ పరిపాలన శాఖ అధికారులు, చీఫ్ సెక్రటరీ సమావేశమై దీనిపై గట్టి న్యాయపోరాటం చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగ సంఘాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ సీఎం వారిని తీవ్రంగా నిరాశపరిచారని దేవీప్రసాద్ విమర్శించారు. నిన్నటి సభలో కొత్త పీఆర్‌సీ గురించి ఎలాంటి చర్చ లేదని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలలో కనీసం ఒకటి రెండు ఇస్తారని ఆశించినా ఇవ్వలేదని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు గురించి సీఎం మాట్లాడకుండా దాటవేశారని ఆరోపించారు. నెలకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామనే సాకుతో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పక్కనబెట్టారని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మరియు భూభారతి ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేవలం తనను ‘అన్న’ అని పిలిపించుకుంటే సరిపోదని, డిమాండ్లు నెరవేరిస్తే ఉద్యోగులే గుర్తిస్తారని హితవు పలికారు.

27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు కుట్ర!
బీఆర్‌ఎస్‌ నేత భుజంగరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. నాడు కేసీఆర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే, నేడు రేవంత్ రెడ్డి రూ. 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కడతామనే సాకుతో రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల దాదాపు 85,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఆనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన స్కూళ్లకు కేవలం రంగులు వేసి, తామే కట్టామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ఉన్న పాఠశాలలను బాగు చేయకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.