మహిళలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు
డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య
తుంగతుర్తిలో ‘ఇందిరా శక్తి భవన’ నిర్మాణానికి భూమి పూజ
కాకతీయ, తుంగతుర్తి : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ‘ఇందిరా శక్తి భవనం’ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రూ.344 కోట్లు వడ్డీ లేని రుణాలను అందిస్తోందని వెల్లడించారు. మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందని, స్వయం ఉపాధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నా రెడ్డి, ఉప సర్పంచ్ పసునూరి సాయికుమార్, వార్డు సభ్యులు రెడ్డి మల్ల రమేష్, అర్వ శ్రీను, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసం వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రఘు రెడ్డి, మహిళా సంఘం సభ్యురాలు వంగాల భాగ్యమ్మ, కాంగ్రెస్ నాయకులు మొరిగాల క్రిష్ణయ్య, ఏనుగుతుల సోమయ్య, ఆంగోతు సోముల నాయక్, చింతకింది కిషన్, వంగాల దాసు, ఫీల్డ్ అసిస్టెంట్ గుడిపాటి కమలాకర్, గ్రామ మైనార్టీ అధ్యక్షుడు షేక్ మల్సూర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

