epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బ్రేకింగ్ మోజు.. బాధ్యత మరిచిన మీడియా!

బ్రేకింగ్ మోజు.. బాధ్యత మరిచిన మీడియా!
ధ్రువీకరణకు ముందే మరణ వార్తలు
సోషల్ మీడియా పోస్టులనే ఆధారంగా చేసుకున్న కొన్ని మీడియా సంస్థలు
పెద్ది కుటుంబ స‌భ్యుల‌కు మాన‌సిక వేద‌న‌
బాధ్యతాయుతమైన జర్నలిజానికి విరుద్ధమంటున్న పాత్రికేయ వర్గాలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : వేగమే లక్ష్యంగా మారిన డిజిటల్ యుగంలో కొన్ని మీడియా సంస్థలు ధృవీకరణ కంటే “మొదట వార్త ఇవ్వాలి” అనే పోటీకే ప్రాధాన్యం ఇస్తుండడం మరోసారి చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురైన ఘటనలో వైద్యుల అధికారిక ప్రకటనకు ముందే మరణించినట్లు ప్రసారం చేయడం బాధ్యతాయుతమైన జర్నలిజంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రాణాపాయ స్థితిలో చికిత్స కొనసాగుతున్న సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను, అనధికార సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురైన తర్వాత వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. డాక్టర్ మమతా రెడ్డి నేతృత్వంలోని బృందం పలుమార్లు సీపీఆర్ నిర్వహించి గుండె స్పందనను పునరుద్ధరించి, అనంతరం లైఫ్ సపోర్ట్‌పై ఉంచి హైదరాబాద్‌కు తరలించింది. వైద్యులు ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనే కొన్ని మీడియా వేదికల్లో ఆయన మరణించినట్లు వార్తలు ప్రసారం కావడం కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.

సోషల్ మీడియా పోస్టే ఆధారమా?

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ సందేశాలనే ప్రాథమిక ఆధారాలుగా తీసుకుని వార్తలు ప్రసారం చేసే ధోరణి పెరుగుతోందని సీనియర్ పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు పెట్టిన పోస్టును మరొకరు ధృవీకరణ లేకుండానే ప్రచారం చేయడం, అధికారిక సమాచారం కోసం వేచి చూడకపోవడం జర్నలిజం మూల సూత్రాలకు విరుద్ధమని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రాణాలకు సంబంధించిన వార్తల్లో వైద్యుల బులెటిన్ లేదా కుటుంబ సభ్యుల అధికారిక ప్రకటన వచ్చే వరకు సంయమనం పాటించడం మీడియా నైతిక బాధ్యతగా పేర్కొంటున్నారు. వార్త ముందుగా ఇవ్వాలనే పోటీ సహజమే అయినప్పటికీ, అది నిజానిజాలను పక్కనపెట్టి ఉండకూడదని మీడియా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒక తప్పు వార్త కేవలం ప్రేక్షకులను, పాఠ‌కుల‌ను తప్పుదోవ పట్టించడమే కాదు, ఆ కుటుంబాన్ని మానసికంగా తీవ్ర వేదనకు గురిచేస్తుందని గుర్తుచేస్తున్నారు. వేగం కంటే విశ్వసనీయతే జర్నలిజం బలం అని, సోషల్ మీడియా ప్రచారాన్ని కాదు.. ధృవీకరించిన సమాచారాన్నే వార్తగా అందించడం మీడియా విశ్వసనీయతను నిలబెడుతుందని అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.