epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జెన్ జీ కోటా.. క్యాబినెట్ సీటా..?

జెన్ జీ కోటా.. క్యాబినెట్ సీటా..?
మంత్రివర్గ రేసులోకి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
యువ ఎమ్మెల్యేలకు అవకాశం పేరుతో అధిష్టానం దృష్టిని ఆకర్షించే యత్నం
రెడ్డి సామాజికవర్గంలోనే మంత్రి పదవికి పెరుగుతున్న పోటీ
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విమర్శలు ఇంకా వెంటాడుతూనే…
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలతో వార్తల్లో.. ఇప్పుడు మంత్రి పదవిపై గురి
జెన్ జీ నినాదానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : రేవంత్ స‌ర్కారులో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న కొద్దీ ఆశావహుల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సామాజిక సమీకరణాల్లో బలమైన నేతలు మంత్రి పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్న వేళ.. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కూడా తన పేరు రేసులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించారు. యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బయటకు చూస్తే యువ నాయకత్వానికి మద్దతుగా చేసిన వ్యాఖ్యల్లా కనిపిస్తున్నా.. అసలు ఉద్దేశం మాత్రం రాబోయే క్యాబినెట్ విస్తరణలో తనకు చోటు కల్పించాలని అధిష్టానానికి సంకేతాలు పంపడమేనన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే యువ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కొత్త రక్తాన్ని మంత్రివర్గంలోకి తీసుకురావాలని అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో యువత, విద్యార్థులకు సంబంధించిన అంశాలు రాజకీయ చర్చగా మారిన వేళ.. అదే “జెన్ జీ” భావనను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నమే ఈ వ్యాఖ్యల వెనుక ఉందన్న విశ్లేషణ వినిపిస్తోంది.

రేసులో సీనియర్లు.. మధ్యలో అనిరుధ్

కాంగ్రెస్‌లో మంత్రి పదవి అంటే కేవలం యువకుడిననే కారణంతో దక్కేది కాదని పార్టీ నేతలే చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ కోసం చేసిన సేవలు, రాజకీయ ప్రభావం, అధిష్టానానికి దగ్గరితనం వంటి అనేక అంశాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అలాంటి పోటీలో ఇప్పుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి కూడా తన అవకాశాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యువ నాయకత్వం పాలనలో వేగం పెంచుతుందని, ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా చేరవేయగలదని అనిరుధ్ రెడ్డి చెబుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కేటాయింపులో కేవలం వయసు ప్రమాణం కాదనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే “జెన్ జీ” కార్డు ఎంతవరకు పనిచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

విమర్శల మధ్య మంత్రి పదవి ఆశలు

జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సొంత గ్రామంలోనే పార్టీకి ఆశించిన ఫలితాలు తీసుకురాలేకపోయారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే మంత్రి పదవిపై బహిరంగంగా సంకేతాలు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు రాష్ట్ర సమస్యల కంటే తరచూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల కంటే ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తారనే ఆరోపణలు ప్రత్యర్థుల నుంచే కాకుండా కాంగ్రెస్‌లోని కొందరి నుంచీ వినిపిస్తున్నాయి. అయితే అనిరుధ్ రెడ్డి మాత్రం తాను అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నాయకత్వం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాజకీయాల్లో ఇలాంటి ప్రకటనలు సహజమే అయినప్పటికీ.. వాటి వెనుక మంత్రి పదవిపై ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉన్నా.. ఆశావహుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. అందులో ఇప్పుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేరు కూడా చేరింది. అయితే “జెన్ జీ” నినాదం అధిష్టానాన్ని ఆకట్టుకుంటుందా.. లేక అనుభవం, రాజకీయ సమీకరణాలకే మరోసారి పెద్దపీట వేస్తుందా అన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.