epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చ‌ర్చి అనుబంధ ఆస్తుల‌తో వ్యాపార‌మా..?

చ‌ర్చి అనుబంధ ఆస్తుల‌తో వ్యాపార‌మా..?
వైరా రోడ్ ఆర్‌సీఎం చర్చి భవన విక్రయంపై ఆరోపణలు
ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పేరుతో వ్యవహారాలపై వివాదం
కలెక్టర్ దృష్టి సారిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి?
విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతున్న క్రైస్త‌వ భ‌క్తులు

కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ఆర్‌సీఎం చర్చి అనుబంధ ఆస్తుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. చర్చి పేరుతో ఉన్న స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి, అందులోని కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు స్థానిక భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పేరును వినియోగించారని, చర్చి ఆస్తుల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

చర్చి ఆస్తులపై వివాదం..

ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డులో ఉన్న ఆర్‌సీఎం చర్చికి ఆనుకుని ఉన్న స్థలం గత కొన్ని సంవత్సరాలుగా చర్చి యాజమాన్య పరిధిలోనే కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించి, అందులోని కొంత భాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపిస్తున్నారు. కొందరు ఫాదర్లు సొసైటీలు, ట్రస్టుల పేరుతో చర్చి ఆస్తులను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. క్యాథలిక్ డయాసిస్ పరిధిలో ఉండే ఆర్‌సీఎం చర్చిల్లో ఆస్తుల నిర్వహణకు కఠినమైన నిబంధనలు అమలులో ఉంటాయని, అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం ఎలా జరిగిందన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

అనుమతులు తీసుకున్నారా..?

చర్చి ఆస్తుల విక్రయానికి చర్చి నిబంధనల ప్రకారం పలు దశల్లో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని చర్చి వ్యవహారాలపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. ముందుగా ప్యారిష్ ప్రీస్ట్, ప్యారిష్ కౌన్సిల్ తీర్మానం, అనంతరం సంబంధిత బిషప్ అనుమతి, డయాసిస్ ఆర్థిక కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆస్తి విలువ అధికంగా ఉంటే రోమ్‌లోని సంబంధిత చర్చి అధికారుల అనుమతి కూడా అవసరమవుతుందని చెబుతున్నారు. అలాగే, ఆస్తి విక్రయం ద్వారా వచ్చిన నిధులను కొత్త చర్చి నిర్మాణం, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అప్పుల చెల్లింపులు వంటి చర్చి ప్రయోజనాలకే వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, ఈ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఈ ఆరోపణల నిజానిజాలను సంబంధిత అధికారులు విచారించాలని కోరుతున్నారు.

ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీపై ప్రశ్నలు

ఈ వ్యవహారంలో ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ పాత్రపైనా స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఈ సొసైటీ నమోదు చేసుకున్నట్లు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం తెలంగాణ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో సంబంధిత పత్రాలు అందుబాటులో కనిపించడం లేదని పేర్కొంటున్నారు. సొసైటీ రెన్యువల్‌కు పలుమార్లు దరఖాస్తు చేసినట్లు ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నప్పటికీ, పూర్తి వివరాలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం, రిజిస్ట్రేషన్ శాఖ సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. చర్చి ఆస్తుల విక్రయం, సొసైటీ వ్యవహారాలు, అనుమతుల ప్రక్రియ, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించి సంబంధిత శాఖలతో విచారణ చేపట్టించాలని, ఆరోపణల్లో వాస్తవం ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.