epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకర్ల సమత లొంగుబాటు

కాకర్ల సమత లొంగుబాటు
నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో
ఎట్ట‌కేల‌కు జనజీవన స్రవంతిలోకి సీనియర్ నాయకురాలు
పునరావాసానికి ప్రభుత్వం భరోసా..
ఆరోగ్య కార్డులు, ఉపాధి శిక్షణ, రుణాల సాయం
డీఐజీ సీవీ ఆనంద్‌ వెల్లడి

కాకతీయ, ములుగు ప్రతినిధి : దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో అండర్‌గ్రౌండ్‌లో కొనసాగిన సీనియర్‌ నాయకురాలు కాకర్ల సమత అలియాస్‌ మాధవి, షకీలా, దుర్గా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆమె లొంగిపోయారు. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని డీఐజీ సీవీ ఆనంద్‌ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య రక్షణ కార్డులు, ఉపాధి శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు, అవసరమైన ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ కార్యాలయంలో సమత లొంగుబాటు వివరాలను ఆయన వెల్లడించారు. 1985లో వైజాగ్‌ ప్రాంతంలో నక్సలైట్‌ కార్యకలాపాలతో ప్రభావితమైన సమత అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారని డీఐజీ తెలిపారు. అప్పటి నుంచి సుమారు 40 ఏళ్లపాటు వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీకి పనిచేశారని చెప్పారు. హైదరాబాద్‌ కమిటీ, నల్లమల, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక–మహారాష్ట్ర ఉమ్మడి కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు వివరించారు. పార్టీ డాక్యుమెంటేషన్‌, సిద్ధాంతపరమైన పత్రాల రూపకల్పన, అనువాదాలు, మహిళా సమస్యలపై రచనలు, క్యాడర్‌కు శిక్షణ వంటి బాధ్యతలు కూడా నిర్వహించారని తెలిపారు. మావోయిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతికి సీసీ స్టాఫ్‌ మెంబర్‌గా పనిచేసినట్లు పేర్కొన్నారు.

23 మందికి రూ.2 కోట్ల సాయం

సమత కుటుంబంలోనూ మావోయిస్టు నేపథ్యం ఉందని డీఐజీ తెలిపారు. ఆమె సోదరి కాకర్ల సునీత అలియాస్‌ బద్రి గత ఏడాది తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. సమత భర్త పటేల్‌ సుధాకర్‌రెడ్డి మావోయిస్టు పార్టీలో మిలిటరీ కమిషన్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో పనిచేసి 2010లో ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు వెల్లడించారు. ఇప్పటికే 23 మంది లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద దాదాపు రూ.2 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఉపాధి కోసం శిక్షణ, రుణాలు, వైద్య సహాయం అందిస్తూ వారిని సమాజంలో గౌరవప్రదంగా స్థిరపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మావోయిస్టు పార్టీ ప్రస్తుత జనరల్‌ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతితో పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న నాయకులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డీఐజీ సీవీ ఆనంద్‌ పిలుపునిచ్చారు. వారి సమస్యలు, కేసులకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైతే కేంద్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలతోనూ చర్చిస్తామని తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలకు గతంలో కీలకంగా ఉన్న ప్రాంతం కావడంతోనే ములుగులో కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.