క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ పాలకవర్గానికి సన్మానం
కాకతీయ, ఖమ్మం టౌన్: ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ పాలకవర్గ సభ్యులను మంగళవారం సన్మానించారు. యూనియన్ కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు బండారి మధు, ఉపాధ్యక్షుడు కుంట శీను, కార్యదర్శి చింతల ఉపేందర్ తదితరులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. యూనియన్ గౌరవ సలహాదారు నరేంద్ర మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామన్నారు. అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో పాషా, సైదులు, జానీ, నరసింహారావు, వెంకటేశు, రమేష్, రఘు, గంగరాజు, నరహరి తదితరులు పాల్గొన్నారు.

