పెండింగ్ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలి
కాకతీయ, ఖమ్మం టౌన్ : అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ కార్డులను జాప్యం లేకుండా మంజూరు చేయాలని టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌కు టీజేఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పెద్ద, మీడియం, చిన్న పత్రికలు, చానళ్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టుల రిపోర్టర్లందరికీ కార్డులు ఇవ్వాలని, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు జిల్లా కార్డులు, రాష్ట్రస్థాయి బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎంప్యానల్ కేబుల్ చానళ్లకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ స్పందిస్తూ అక్రిడేషన్ కమిటీ సమావేశం నిర్వహించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డీపీఆర్‌వో గౌస్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో చిర్రా రవి, వెన్న బోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, శెట్టి రజినీకాంత్, ప్రశాంత్ రెడ్డి, భాస్కర్, మందుల ఉపేందర్, హరీష్, మందటి రమణ, గుద్దేటి రమేష్ బాబు, రామి శెట్టి విజేత, అడపాల నాగేందర్, శాస్త్రి, రాజు, నాగరాజు, అమరవరపు కోటేశ్వరరావు, ఎస్వీ రెడ్డి, రేపాక యాదగిరి, ఉల్లోజు రమేష్, నల్లమోతు శ్రీనివాస్, గోవిందు, రోసి రెడ్డి, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, మాధవి, కిరణ్మయి, పెంటి వెంకటేశ్వర్లు, మోహన్, సాయి, గౌరీ శంకర్, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

