epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్‌ ఈస్ట్‌ కాంగ్రెస్‌లో ముసలం!

వరంగల్‌ ఈస్ట్‌ కాంగ్రెస్‌లో ముసలం!
సీఎం రేవంత్‌కు సుస్మిత పటేల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
బీసీలను అణగదొక్కుతూ.. అక్రమ కేసులు పెడుతున్నారు
కొండా దంపతుల తీరుతో పార్టీకి నష్టం
కొండా దంపతులను బర్తరఫ్‌ చేయాలి
కాంగ్రెస్‌ నేత నల్గొండ రమేష్‌

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతూ.. అదే సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడు ఎదగకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత నల్గొండ రమేష్‌ ఆరోపించారు. కొండా దంపతుల విధానంతో పార్టీకి నష్టం జరుగుతోందని, నాయకులకు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుస్మిత పటేల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మాజీ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌ (రాంకీ) నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు మంత్రి కొండా సురేఖ, కొండా మురళి, సుస్మిత పటేల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.కొండా దంపతుల విధానంతో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతోందని నల్గొండ రమేష్‌ అన్నారు. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో రెండో బీసీ నాయకుడు ఎదగకుండా చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులకు నియోజకవర్గంలో తిరిగే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను పక్కనపెట్టి ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీసీలను అణగదొక్కుతున్నారంటూ ఆరోపణలు

యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పరమేశ్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుస్మిత పటేల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ తూర్పులో బీసీలను తొక్కడమే కొండా దంపతుల పనిగా మారిందని ఆరోపించారు. బీసీ మహిళ అయి ఉండి బీసీలనే అణగదొక్కుతున్నారని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి రౌడీషీట్లు ఓపెన్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

కొండా మురళికి ఏ హోదా ఉందని టికెట్లు ప్రకటిస్తారు?
మాజీ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌ 

“కొండా మురళికి ఏ హోదా ఉందని పరకాల టికెట్‌, కార్పొరేటర్‌ టికెట్లు ప్రకటిస్తారు? మీరెవరు ప్రకటించడానికి?” అని మాజీ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌ (రాంకీ) ప్రశ్నించారు. క్రమశిక్షణ లేని వారు పార్టీలో ఉండకూడదని అన్నారు. మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బర్తరఫ్‌ వేడుకల కోసం తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొండా దంపతుల వ్యవహారం శాడిజాన్ని తలపిస్తోందని, కొట్టిస్తున్న వీడియోలు చూసి ఆనందిస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. వారితో ఉన్నవారు ప్రేమతో కాకుండా భయంతో ఉన్నారని అన్నారు. “మీది ఊపు కాదు.. వాపు” అని ఎద్దేవా చేశారు. కొండా దంపతులను బర్తరఫ్‌ చేస్తే వారి ఇంటి ముందు నలుగురు కూడా కనిపించరని ఘాటుగా వ్యాఖ్యానించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.