లాలు తండాలో ఘనంగా వనంహోత్సవం
చెట్లతో జీవవైవిధ్య సమతుల్యతను కాపాడుతుంది
— ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి
కాకతీయ, ఇనుగుర్తి: మొక్కలు నాటి వాటిని పెద్ద చెట్లు అయ్యేదాకా సంరక్షిస్తే అవి జీవవైవిద్య సమతుల్యతను కాపాడి మానవ జీవనోపాధిలో ఎంతో దోహదపడతాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని లాలు తండ గ్రామంలో సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో వన మహోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి లాలు తండా సర్పంచ్ లక్ష్మీ, ఉప సర్పంచ్ రజిత రాజు లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ సమితి లేదను కాపాడడానికి మొక్కలు ఎంతో ప్రాముఖ్యతమని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జీవన్, రవి బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ రామారావు, ఆదినారాయణ, స్కూల్ హెచ్ఎం రాములు, వేణు తదితరులు పాల్గొన్నారు.

