epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం

రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌
ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ స్వాధీనం
ఒడిశా నుంచి తెచ్చి పలు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తింపు
వివరాలు వెల్లడించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని దామెర పోలీసులు అరెస్ట్‌ చేసి, అతడి నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన ముదిగొండ నాగేశ్వర్‌రావు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తనకున్న నెట్‌వర్క్‌ ద్వారా ఒడిశాకు చెందిన రమేష్‌, సుధాకర్‌ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలువురికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న దామెర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో గంజాయి కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతడి ఇంట్లో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇతర నిందితుల కోసం గాలింపు

గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర నిందితులను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా కాపాడటంతో పాటు గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసీపీ సతీష్‌బాబు, శాయంపేట సీఐ సుధాకర్‌రెడ్డి, దామెర ఎస్‌ఐ వీరభద్రరావు, శాయంపేట ఎస్‌ఐ పరమేశ్వర్‌, పరకాల ఎస్‌ఐ రఘుపతి, ఏఏఓ సల్మాన్‌పాషాతో పాటు దామెర, శాయంపేట పోలీసు సిబ్బందిని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.