epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమాలకు బల్దియా ప్రసన్నం!

అక్రమాలకు బల్దియా ప్రసన్నం!
సర్వే నంబర్లు మార్చి ఇంటి నంబర్లు కేటాయింపు
డిప్యూటీ కమిషనర్‌ సంతకంతో వివాదాస్పద ఉత్తర్వులు
గ్రీవెన్స్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం
బాధితులకు ‘కోర్టుకు వెళ్లాంటూ అధికారుల ఉచిత‌ సూచ‌న‌
డీసీ ప్రసన్నరాణి తీరుపై వెల్లువెత్తుతున్న‌ ఆరోపణలు

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఒకే స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లు, ఇంటి నంబర్ల విషయంలో భిన్నమైన రికార్డులు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కాశిబుగ్గ సర్కిల్‌ పరిధిలోని పైడిపల్లి శివారు కత్తెరశాల లక్ష్మీకాంత్‌ కాలనీలో 600 గజాల స్థలానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులకు గతంలో మంజూరైన ఇంటి నంబర్లను తొలగించి.. మరో వ్యక్తి పేరుతో ఇంటి నంబర్‌ కొనసాగించేందుకు డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి పేరుతో నోటీసులు జారీ కావడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేయగా.. సమస్యను కోర్టులో తేల్చుకోవాలని డీసీ సూచించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పైడిపల్లి శివారు కత్తెరశాల లక్ష్మీకాంత్‌ కాలనీలోని సర్వే నంబర్‌ 624లో 600 గజాల స్థలాన్ని నీలారపు మంజుల, పెంచర్ల రాజు పటేల్‌, షేర్ల కుమారస్వామి కొనుగోలు చేసినట్లు వారు చెబుతున్నారు. సంబంధిత పత్రాల ఆధారంగా మ్యూటేషన్లు జరిగాయని, అప్పటి నుంచి ఇంటి పన్నులు, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తూ స్థలాన్ని వినియోగిస్తున్నామని పేర్కొంటున్నారు. మంజులకు 47-5-1395/1/4, రాజుకు 47-5-1395/1/3, కుమారస్వామికి 47-5-1395/1/5 ఇంటి నంబర్లు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కొంతకాలం తర్వాత రామసహాయం వెంకట్‌రెడ్డి అదే ప్రాంతంలోని ఇళ్లను చూపించి తన పేరుతో కొత్త ఇంటి నంబర్‌ పొందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయనకు సంబంధించిన సర్వే నంబర్‌ 527/బిగా రికార్డుల్లో నమోదైనట్లు చెబుతున్నారు. దీనిపై అప్పటి డిప్యూటీ కమిషనర్‌ ఇసంపల్లి జోనాకు ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం వెంకట్‌రెడ్డి ఇంటి నంబర్‌ రద్దు చేసినట్లు బాధితులు తెలిపారు.

మళ్లీ తెరపైకి పాత వివాదం

దాదాపు ఐదేళ్ల తర్వాత రెండు నెలల క్రితం కాశిబుగ్గ సర్కిల్‌ నుంచి బాధితులకు నోటీసులు రావడంతో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. వెంకట్‌రెడ్డి సమర్పించిన పత్రాలను పరిశీలించగా 527/బి సర్వే నంబర్‌లోని 600 గజాల స్థలానికి ఆయనే యజమాని, స్వాధీనదారుడిగా గుర్తించినట్లు నోటీసులో పేర్కొన్నారు. 2005లో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు, 2015–17 మధ్య ఎల్‌ఆర్‌ఎన్‌ పొందినట్లు, నిర్మాణానికి అనుమతి తీసుకున్నట్లు అందులో ప్రస్తావించారు. దీంతో బాధితుల ఇంటి నంబర్లు తొలగించి వెంకట్‌రెడ్డి ఇంటి నంబర్‌ను కొనసాగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నట్లు వారు చెబుతున్నారు.

సర్వే రిపోర్టులో ఏముంది?

జూలై 13న తమ ఇంటి ప్రహరీ గోడను వెంకట్‌రెడ్డి కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా జూలై 18న కేసు నమోదైనట్లు తెలిపారు. అనంతరం ఇరువర్గాల వాదనల నేపథ్యంలో ఏసీ సర్వే నిర్వహించగా.. ఈ నెల 5న జరిగిన సర్వేకు సంబంధించి 14న ఇచ్చిన నివేదికలో స్థలం సర్వే నంబర్‌ 624/1/2కు సంబంధించినదిగా గుర్తించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ రిపోర్టుతోపాటు తమ హక్కు పత్రాలను కమిషనర్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో సమర్పించినట్లు తెలిపారు. అక్కడే ఉన్న కాశిబుగ్గ సర్కిల్‌ డీసీ ప్రసన్నరాణికి కూడా వివరాలు అందించామని, అయితే ‘ఇది మా పరిధిలో లేదు.. కోర్టుకు వెళ్లండి’ అని సూచించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

రికార్డులపై విచారణ జరగాలి

తమకు గతంలో మంజూరైన ఇంటి నంబర్లను తొలగించి.. మరో సర్వే నంబర్‌కు చెందిన వ్యక్తి పేరుతో ఇంటి నంబర్‌ ఎలా కొనసాగిస్తారన్నదే బాధితుల ప్రధాన ప్రశ్న. ఒకవైపు సర్వే నివేదిక 624/1/2ను సూచిస్తుండగా.. మరోవైపు 527/బి ఆధారంగా వెంకట్‌రెడ్డి ఇంటి నంబర్‌ను కొనసాగించడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత మ్యూటేషన్‌ రికార్డులు, ఇంటి నంబర్ల కేటాయింపు ఫైళ్లు, సర్వే నివేదికలు, నిర్మాణ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎన్‌ పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరుతున్నారు. తమ ఇంటి నంబర్లను పునరుద్ధరించి, వివాదాస్పద నిర్ణయాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంజుల, కుమారస్వామి, రాజు డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.