epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం.. హాజరైన మోదీ, ధన్ ఖడ్, చంద్రబాబు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్‌, వెంకయ్య నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు.

జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు అవసరమయ్యాయి. ఎన్డీఏ తరఫున సీపీ రాధాకృష్ణన్ రంగంలోకి దిగగా, ప్రతిపక్షం తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఈనెల 9న జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ 152 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంచనాల ప్రకారమే ఆయన విజయం సాధించారని చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన అనంతరం మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు తాత్కాలికంగా అప్పగించారు.

సీపీ రాధాకృష్ణన్‌ పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. ఆయన 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. బీబీఏ పట్టభద్రుడైన ఆయన విద్యార్థి దశలో టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, క్రికెట్, వాలీబాల్‌లపై ఆసక్తి చూపారు. భారత మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రేరణతో ఆయన తల్లి తన కుమారునికి రాధాకృష్ణన్ అనే పేరు పెట్టారు.

రాధాకృష్ణన్ 16వ ఏట నుంచే ఆర్ఎస్సెస్, జనసంఘ్‌లతో అనుబంధం కలిగి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 1998, 1999లో కోయంబత్తూరు నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుండి 2007 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ కాలంలో 93 రోజులపాటు 19,000 కి.మీ. రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం నిర్మూలన, ఉగ్రవాద వ్యతిరేక ప్రచారాలు చేపట్టారు.

2014, 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు. 2023లో తొలిసారి ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులై, తరువాత తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులై, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు వరకు ఆ పదవిలో కొనసాగారు.

ఎంపీగా ఉన్న సమయంలో రాధాకృష్ణన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ-జౌళి చైర్మన్‌గా, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ కమిటీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వంటి పలు కీలక కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. 2004లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి బృందంలో భాగమయ్యారు. తైవాన్‌కు వెళ్లిన తొలి పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో కూడా పాల్గొన్నారు. 2016–2020 మధ్యకాలంలో కాయిర్-కొబ్బరి పీచు బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 2020లో కేరళ BJP వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులై 2022 వరకు సేవలందించారు. సీపీ రాధాకృష్ణన్, తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తి. ఆయనకు ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్‌. వెంకటరామన్ ఈ గౌరవాన్ని పొందారు. ప్రస్తుతం దేశ రెండవ అత్యున్నత పదవికి ఎన్నికై ఆయన కొత్త అధ్యాయం ప్రారంభించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.