కరెంటు లేక రైతుల అవస్థలు
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి
ఎల్‌నినో ముప్పు తెలిసినా ముందస్తు ప్రణాళిక లేదు
తక్షణమే సాగునీరు, విద్యుత్ అందించాలి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సాగునీరు, విద్యుత్ అందక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. పంటలకు అవసరమైన సాగునీరు, విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికతో వ్యవహరించలేదని పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. దీంతో ప్రస్తుతం పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన కారణంగా పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సాగునీరు, విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి రైతుల ఇబ్బందులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తక్షణమే నీరు.. విద్యుత్ ఇవ్వాలి
రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పువ్వాడ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీరు, విద్యుత్ అందించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం ముందే తెలిసినప్పటికీ అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి అవసరమైన నీరు, విద్యుత్ అందించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు.

