మన అంగన్వాడీ మన బాధ్యత
కాకతీయ ప్రతినిధి – ఏలూరు : మన అంగన్వాడీ మన బాధ్యత అని సీడీపీవో బ్యూలా తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన పోషణ్ మహా కార్యక్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మన అంగన్వాడీ మన బాధ్యతపై ముందస్తు ప్రణాళిక ఉంటుందని.. 9వ తేదీ నుంచి పోషణ్ మహా కార్యక్రమం ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఘనంగా నిర్వహించాలన్నారు. 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల తల్లులకు, గర్భవతులకు, బాలింతలకు పోషకాహారం గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో బ్యూలా, సూపర్‌వైజర్ కె. పద్మజ్యోతి అంగన్వాడీ కార్యకర్తలపై పోషణ్ మహాపై పలు సూచనలు చేశారు.

