ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు అంజుమ్ సుల్తానా ఎంపిక
వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం
సాంకేతికత, సమ్మిళిత విద్య, మూల్యాంకన విధానాలపై అవగాహన
అభినందించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
కాకతీయ, నెల్లికుదురు: ఫిన్లాండ్‌లోని వినూత్న, అనుభవాత్మక, కార్యకలాప ఆధారిత బోధనా పద్ధతులను అధ్యయనం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ సోషల్ స్టడీస్ టీజీటీ, తెలంగాణ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఎం.ఏ. అంజుమ్ సుల్తానా తెలిపారు. ఫిన్లాండ్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు ఆమె ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అంజుమ్ సుల్తానా మాట్లాడుతూ సాంకేతికత వినియోగం, సమ్మిళిత విద్య, మూల్యాంకన విధానాలపై అవగాహన పొందనున్నట్లు తెలిపారు. అక్కడ సేకరించే జ్ఞానం, అనుభవాలను తరగతి గది కార్యకలాపాలు, ప్రాజెక్టులు, డిజిటల్ వనరుల ద్వారా విద్యార్థులకు అందిస్తానన్నారు. తద్వారా చదువును మరింత ఆసక్తికరంగా, అర్థవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. జిల్లా అధికారుల అనుమతితో ఎక్స్‌పోజర్ విజిట్‌లో పొందిన అనుభవాలను జిల్లాలోని సహ ఉపాధ్యాయులతో పంచుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, సహ ఉపాధ్యాయులు అంజుమ్ సుల్తానాను అభినందించారు.

