epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు
సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏప్రిల్‌ 10, 2027న లేటరల్‌ ఎంట్రీ సెలెక్షన్‌ టెస్ట్‌
గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్ల కేటాయింపు
పీఎం శ్రీ జవహర్‌ నవోదయ విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ టి. రమేష్‌
కాకతీయ, వరంగల్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే లేటరల్‌ ఎంట్రీ సెలెక్షన్‌ టెస్ట్‌–2027కు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పీఎం శ్రీ జవహర్‌ నవోదయ విద్యాలయం, మామూనూర్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ టి. రమేష్‌ తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి విధానం ప్రకారం బాహ్య సంస్థ నిర్వహించే ఎంపిక పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశానికి అర్హులని టి. రమేష్‌ తెలిపారు. విద్యార్థి జన్మతేది 01-05-2012 నుంచి 31-07-2014 మధ్య ఉండాలని, రెండు తేదీలను కలుపుకొని పరిగణిస్తామని చెప్పారు. విద్యార్థి ప్రవేశం కోరుతున్న జవహర్‌ నవోదయ విద్యాలయం ఉన్న అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదివి విద్యా సంవత్సరం పూర్తి చేసి ఉండాలని తెలిపారు. 11వ తరగతి ప్రవేశానికి 2026–27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. వారి జన్మతేది 01-06-2010 నుంచి 31-07-2012 మధ్య ఉండాలని, అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదివి విద్యా సంవత్సరం పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. 9వ, 11వ తరగతులకు ఎంపిక పరీక్ష 10-04-2027న నిర్వహించనున్నట్లు తెలిపారు.
గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు
నవోదయ విద్యాలయాలు పూర్తిగా ఉచిత విద్య అందించే సహవిద్యా, నివాస పాఠశాలలని టి. రమేష్‌ తెలిపారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ అనుబంధంతో, ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యప్రణాళిక ఆధారంగా ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధన ఉంటుందని చెప్పారు. 9వ తరగతిలో హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి హిందీ మాట్లాడని ప్రాంతాలకు, అలాగే దీనికి విరుద్ధంగా విద్యార్థుల మైగ్రేషన్‌ విధానం ఉంటుందని వివరించారు.
ప్రవేశాల్లో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారని తెలిపారు. విద్యార్థి తన చదువులో ఏదైనా భాగాన్ని పట్టణ ప్రాంతంలో చదివినట్లయితే అర్బన్‌ అభ్యర్థిగా పరిగణిస్తామని పేర్కొన్నారు. పాఠశాల గ్రామపంచాయతీ పరిధిలో ఉంటే గ్రామీణ ప్రాంతంగా, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌ పరిధిలో ఉంటే పట్టణ ప్రాంతంగా పరిగణిస్తారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, బాలికలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు.
అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు
అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టి. రమేష్‌ సూచించారు. 9వ, 11వ తరగతుల ప్రవేశాలకు ప్రత్యేక ఆన్‌లైన్‌ దరఖాస్తు లింకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు గడువులోగా దరఖాస్తులు సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.