మండల స్థాయి క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులు
శంకరపట్నంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో పోటీలు
కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు మంగళవారం కేశవపట్నం జెడ్పీహెచ్‌ఎస్‌లో విజయవంతంగా ముగిశాయి. అండర్–14, అండర్–17 బాలికల విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లాస్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొంటారని మండల క్రీడా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భక్తురాజ్ కుమార్, వాసుదేవ్, అంజలి, జగబ్బీర్ సింగ్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

