epaper
Monday, September 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌!

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌!
సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం
2009లో మొదలై.. గ్రామ యువతకు ఐక్యతా వేదికగా
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడితో నవరాత్రులు
వావిలాల గణేష్‌ లడ్డూకు ప్రత్యేక గుర్తింపు
స్థాపకుల బాటలో కొత్త నాయకత్వం.. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు
కాకతీయ, మహబూబాబాద్‌ : ఒక చిన్న ఆలోచనగా మొదలైన యంగ్‌ స్టార్స్‌ యూత్‌.. 17వ వసంతంలోకి అడుగుపెట్టి గ్రామ యువతకు ఐక్యత, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. 2009లో బైరి రంజిత్‌కుమార్‌, మద్దెల రాజేష్‌ ఆలోచనతో ప్రారంభమైన యూత్‌ అసోసియేషన్‌.. కొద్దిమంది యువకులతో మొదలై నేడు గ్రామంలోని పలువురు యువతను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే స్థాయికి ఎదిగింది. యువత అంటే వినోదానికే పరిమితం కాదని.. గ్రామానికి అవసరమైన సమయంలో ముందుండి సేవ చేయవచ్చని యంగ్‌ స్టార్స్‌ యూత్‌ తమ కార్యక్రమాలతో చాటుతోంది.
వినాయక నవరాత్రుల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వావిలాలలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణహిత విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు భక్తి, సామాజిక బాధ్యతను కలగలిపి ఉత్సవాలను నిర్వహించడం యూత్‌ ప్రత్యేకతగా నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ గణేష్‌కు ఎంతటి గుర్తింపు ఉందో.. వావిలాలలో యంగ్‌ స్టార్స్‌ యూత్‌ గణేష్‌ లడ్డూకు అంతే ప్రత్యేకత ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.
లడ్డూకు భారీ డిమాండ్‌
యంగ్‌ స్టార్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే గణేష్‌ లడ్డూను వేలం పాటలో దక్కించుకునేందుకు ప్రతి ఏటా భక్తులు ఆసక్తి చూపుతున్నారు. లడ్డూను దక్కించుకున్న వారికి అంతా మంచే జరుగుతుందన్న విశ్వాసంతో వేలం పాటలో పోటీ పడుతున్నారు. దీంతో వినాయక నవరాత్రుల్లో వావిలాల లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
యంగ్‌ స్టార్స్‌ యూత్‌కు బలమైన పునాదులు వేసిన బైరి రంజిత్‌కుమార్‌, మద్దెల రాజేష్‌ 15 ఏళ్లపాటు యువతను సమన్వయం చేస్తూ సంస్థను ముందుకు నడిపించారు. వారు పెంపొందించిన ఐక్యత, సోదరభావం, సేవా స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్షుడు నాళ్లం రఘుపతి, ఉపాధ్యక్షుడు మారగాని అశోక్‌ ఆధ్వర్యంలో యువత సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
పండుగలకే పరిమితం కాకుండా..
యంగ్‌ స్టార్స్‌ యూత్‌ కార్యక్రమాలు కేవలం పండుగల నిర్వహణకే పరిమితం కావడం లేదు. గ్రామంలో సామాజిక సేవ, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యమవుతోంది. గ్రామ అవసరాలను గుర్తించి అందుబాటులో ఉన్నంత మేరకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ‘ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరం’ అనే స్ఫూర్తితో యంగ్‌ స్టార్స్‌ యూత్‌ 17వ వసంతంలోకి అడుగుపెట్టింది. స్థాపకులు వేసిన సేవా పునాదులను కొనసాగిస్తూ.. కొత్త నాయకత్వంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు యువత సిద్ధమవుతోంది. గ్రామ యువతను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే వేదికగా 17 ఏళ్లుగా కొనసాగుతున్న యంగ్‌ స్టార్స్‌ యూత్‌ ప్రస్థానం.. వావిలాల గ్రామంలో యువత ఐక్యతకు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌ 

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌  కాకతీయ, నెల్లికుదురు:...

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి విద్యతోనే బీసీలు ఉన్నతమైన ఎదుగుద‌ల సాధ్యం హక్కుల సాధ‌న‌కు...

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు రూ. 4.20 లక్షల వరకు అక్రమ...

కోల్డ్‌ ‘చోరేజీలు’!

కోల్డ్‌ ‘చోరేజీలు’! ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా! తెర...

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు విద్యార్థులు లక్ష్యాన్ని...

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కాకతీయ, పెద్దవంగర : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మండల...

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్‌

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్‌ డబ్బుల విషయంలో గొడవలే హత్యకు కారణం ఏసీపీ...

మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య

మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య అన్న చేతిలో తమ్ముడు బలి.. కత్తితో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.