విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ
దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు
విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ముందుకు సాగాలి
ప్రవాస భారతీయుడు గాదె అరుణగోపాల్‌రెడ్డి సూచన
కాకతీయ, పెద్దవంగర : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సైకిళ్లు పంపిణీ చేసినట్లు ప్రవాస భారతీయుడు గాదె అరుణగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని అవుతాపురం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాదె అరుణగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు భవనం నిర్మించి ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు రూ.1.50 లక్షల విలువైన 21 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నప్పుడే లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం గంగిశెట్టి రమేష్‌కుమార్, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ ఎం.వి. గోనారెడ్డి, అధ్యక్షులు మట్ట రాజేశ్వర్, కార్యదర్శి వినీల్‌రెడ్డి, గడ్డం వేణుగోపాల్‌రెడ్డి, సంధ్య గ్రామ పార్టీ అధ్యక్షులు బిక్షపతి, రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీను, నరసింహారావు, వెంకటేశ్వర్లు, సింహాద్రి, సోమయ్య, అజయ్, శిల్ప, మహేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

