మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలం లోని చిన్నముప్పారం గ్రామంలోని రాజీవ్ సెంటర్లో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రాయలి భవాని శేఖర్ గురువారం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , కిషన్ బ్రదర్స్ గ్రామ ప్రజల కోసం స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి కొద్దిరోజు బ్రదర్స్ సహకార అందజేయడంతో భూమి పూజ నిర్వహించామన్నారు. ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత వద్దిరాజు కిషన్ బ్రదర్స్ కు గ్రామ సర్పంచ్ భవాని శేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ రాయిలి భవాని శేఖర్, పిఎసిఎస్ చైర్మన్ దికొండ వెంకన్న, శ్రీరామగిరి పిఎసిఎస్ చైర్మన్ గుండా వెంకన్న, ఉప సర్పంచ్ మల్లం ఐలయ్య, దర్శనం బిక్షపతి, రాయిలి ఉప్పలయ్య, చందు, కారుపోతుల సుమన్, రాయిలి గంగాధర్, కాలేరు నేతాజీ, వార్డు సభ్యులు, తాడబోయిన లింగయ్య, కట్ల అనిల్, పద్మ కనకయ్య, రాకేష్, పల్ల రాము, కాలేరు లక్ష్మినర్సు, వెంకటేశ్వర్లు, నందయ్య, కామినేని బాలరాజు, శ్రీహరి, సోమయ్య, వీరేష్, లింగయ్య, పుల్లయ్య, రాంబాబు, పెంటయ్య, వెంకట్రాంనర్సయ్య, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

