epaper
Saturday, October 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పదవికో రేటు.. పనికో వాటా?

పదవికో రేటు.. పనికో వాటా?
వ‌రంగ‌ల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ప‌నితీరుపై ఆరోప‌ణ‌లు
బేర‌సారాల‌తోనే నామినేటెడ్ ప‌ద‌వులు కేటాయిస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు
సహకార సంఘాల చైర్మన్ ప‌ద‌వుల‌పై క‌మ్ముకుంటున్న నీలిమేఘాలు
స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ అంటూ గుస‌గుస‌లు
ఆరు సహకార సంఘాలకు చైర్మన్ల నియామ‌కంతో ముదిరిన చర్చ
అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్‌లో 5 శాతం వాటా అంటూ ప్రచారం
కొత్తవారికే ప్రాధాన్యం.. పాత కాంగ్రెస్‌ క్యాడర్‌లో అసంతృప్తి..!
వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చుట్టూ రాజకీయ అసంతృప్తితోపాటు పదవులు, పనులు, వసూళ్ల వ్యవహారమే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నామినేటెడ్‌ పదవుల కేటాయింపు నుంచి వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్‌ పదవుల వరకు బేరసారాలు సాగాయన్న ప్రచారం కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలను వేడెక్కిస్తోంది. పదవి స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్లు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 12 వ్యవసాయ సహకార సంఘాలకు గాను 6 సంఘాల చైర్మన్ల ఎన్నికలు పూర్తికావడంతో ఈ వ్యవహారంపై చర్చ మరింత జోరందుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపడుతున్న పనుల ప్రొసీడింగ్స్‌లో 5 శాతం వాటా నడుస్తోందన్న ప్రచారం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే కుమారుడి జోక్యంపై గుసగుసలు, పాత కాంగ్రెస్‌ క్యాడర్‌ను పక్కనపెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి.. ఇలా ఒక్కో అంశం రాజకీయంగా కాక రేపుతోంది.

పదవులకూ రేటు కడుతున్నారా?

నామినేటెడ్‌ పదవుల భర్తీ మొదలైనప్పటి నుంచే బేరసారాల వ్యవహారంపై నియోజకవర్గంలో అంతర్గత చర్చ మొదలైంది. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకాల సమయంలోనూ ఇదే తరహా ప్రచారం జరిగినట్లు సమాచారం. అప్పట్లో ఎమ్మెల్యే రాజకీయాలకు కొత్త కావడంతో క్యాడర్‌ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్‌ పదవుల కేటాయింపులోనూ డబ్బుల వ్యవహారం తెరపైకి రావడంతో గతంలో జరిగిన ప్రచారాన్ని కూడా కాంగ్రెస్‌ సీనియర్లు గుర్తుచేసుకుంటున్నట్లు సమాచారం. పదవి స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బేరాలు నడుస్తున్నాయన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. నియోజకవర్గ పరిధిలో 12 వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా ఇప్పటి వరకు 6 సంఘాల్లో చైర్మన్ల ఎన్నిక పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కో చైర్మన్‌ పదవికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డిమాండ్‌ జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పిన వారికే కొన్ని సంఘాల్లో చైర్మన్‌ పదవులు దక్కాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన కీలక చైర్మన్‌ పదవికి రూ.20 లక్షల వరకు వ్యవహారం నడిచిందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే డబ్బులు చేతులు మారినట్లు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా.. ఎన్నికైన వారి రాజకీయ, ఆర్థిక నేపథ్యాలను బేరసారాల ప్రచారంతో ముడిపెట్టి కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. వ్యవసాయ సహకార సంఘాల పదవులు రైతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారికి దక్కాల్సి ఉండగా, వ్యాపార నేపథ్యం ఉన్న వారికి కొన్ని చోట్ల ప్రాధాన్యం లభించిందన్న చర్చ కూడా మొదలైంది. ఆర్థిక స్థోమత, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే కీలక పదవులు దక్కడం వెనుక ఏం జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రైతు ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన సహకార సంఘాల్లో రాజకీయ విధేయత, ఆర్థిక సామర్థ్యమే ప్రమాణాలుగా మారుతున్నాయన్న చర్చ బేరసారాల ప్రచారానికి మరింత ఊతమిస్తున్నట్లు సమాచారం.

పనుల ప్రొసీడింగ్స్‌లో 5 శాతం వాటా?

నామినేటెడ్‌ పదవులకే పరిమితం కాకుండా అభివృద్ధి పనుల విషయంలోనూ వసూళ్ల ప్రచారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపడుతున్న పనుల ప్రొసీడింగ్స్‌లో 5 శాతం వాటా నడుస్తోందన్న టాక్‌ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. పనులు పొందాలంటే నిర్దిష్ట వాటా ఇవ్వాల్సి వస్తోందన్న ప్రచారం నిజమెంత అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ.. ఈ వ్యవహారం రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పదవుల కేటాయింపు, పనుల మంజూరు రెండింటి విషయంలోనూ డబ్బుల ప్రస్తావన రావడం కాంగ్రెస్‌ క్యాడర్‌లో అసంతృప్తిని మరింత పెంచుతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనుల కేటాయింపుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు నచ్చిన కార్యకర్తలు ఉన్న గ్రామాలకు పనుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తోందని, అనుకూలంగా లేని గ్రామాలకు నిధులు రావడం లేదన్న చర్చ సాగుతోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులను రాజకీయ విధేయతతో ముడిపెడుతున్నారన్న అసంతృప్తి కూడా ఉన్నట్లు సమాచారం. దీనికితోడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే కుమారుడి జోక్యం పెరిగిందన్న గుసగుసలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. అధికారులతో వ్యవహారాలు, పనులకు సంబంధించిన అంశాల్లో ఆయన ప్రమేయం ఉంటోందన్న చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది.

పాత క్యాడర్‌కు దక్కని గుర్తింపు

మొదటి నుంచీ కాంగ్రెస్‌ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి క్రమంగా బయటకు వస్తున్నట్లు సమాచారం. పదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడిన వారిని కనీసం గుర్తించడం లేదన్న ఆగ్రహం సీనియర్‌ క్యాడర్‌లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు పదవులు, పనుల్లో తగిన ప్రాధాన్యం లేకపోవడం పాత కాంగ్రెస్‌ నేతలను అసంతృప్తికి గురిచేస్తున్నట్లు సమాచారం. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే దగ్గరగా ఉంటూ.. మొదటి నుంచీ పార్టీని మోసిన వారిని పట్టించుకోవడం లేదన్న భావన బలపడుతున్నట్లు తెలుస్తోంది.

సొంత నియోజకవర్గంలో కంటే బయటే ఎక్కువా?

స‌ద‌రు నేత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించకపోయినా అప్పటి కాంగ్రెస్‌ అనుకూల పరిస్థితులతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ చేసిన కృషి విజయానికి దోహదపడిందన్న అభిప్రాయం ఉంది. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సొంత నియోజకవర్గంలో కంటే పక్క నియోజకవర్గాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నట్లు సమాచారం. మొదట్లో రాజకీయాలకు కొత్త కావడంతో ఇతర ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించేందుకు వారి సమావేశాలకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు భావించినట్లు తెలుస్తోంది. అయితే కాలం గడుస్తున్నా సొంత నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరుదుగా అందుబాటులో ఉంటున్నారన్న చర్చ కూడా కొనసాగుతోంది.

సీనియర్లను గుర్తుపట్టని పరిస్థితి

ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్‌ నాయకులను ఎమ్మెల్యే ఇప్పటికీ గుర్తుపట్టడం లేదన్న ఆవేదన కూడా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. గ్రామస్తులు, ద్వితీయశ్రేణి నాయకులను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన సందర్భాల్లోనే సీనియర్‌ కార్యకర్తలను వారి గ్రామం, పేరు అడగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తొలినాళ్లలో రాజకీయాలకు కొత్త కావడంతో సహజమేనని భావించినా.. ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లు కావస్తున్నా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకపోవడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఇతర నియోజకవర్గాల నేతలు తమను గుర్తించి పలకరిస్తున్నా.. సొంత ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదన్న భావన బలపడుతున్నట్లు సమాచారం.

అధిష్ఠానం దృష్టికి పంచాయితీ?

ఇన్నాళ్లు ఎమ్మెల్యే రాజకీయాలకు కొత్త అన్న కారణంతో ఓపికగా ఉన్నామని.. ఇకపై ఇదే పరిస్థితిని సహించేది లేదన్న భావన కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల్లో బలపడినట్లు విశ్వసనీయ సమాచారం. నామినేటెడ్‌ పదవుల కేటాయింపు, సహకార సంఘాల చైర్మన్‌ పదవులు, అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్‌, ఉపాధి హామీ నిధులు, క్యాడర్‌తో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు సీనియర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశాలపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ‘పదవులు–పనులు–వసూళ్లు’ వ్యవహారమే రాజకీయ హాట్‌టాపిక్‌గా మారింది. మండల అధ్యక్ష పదవుల నుంచి సహకార సంఘాల చైర్మన్‌ కుర్చీల వరకు బేరసారాల ప్రచారం, అభివృద్ధి పనుల్లో వాటా అంటూ వినిపిస్తున్న మాటలు, ఉపాధి పనుల కేటాయింపుపై విమర్శలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కుటుంబ సభ్యుల జోక్యంపై గుసగుసలు.. అన్నీ కలిసి ఎమ్మెల్యే చుట్టూ రాజకీయ వేడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పాత కాంగ్రెస్‌ క్యాడర్‌ అసంతృప్తి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం, ఎమ్మెల్యే అందుబాటుపై ఉన్న అసంతృప్తి ఒక్కటవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చివరకు పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లి రాజకీయ పంచాయితీగా మారుతాయా.. లేక ఎమ్మెల్యే క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా అన్నది ఇప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరాయి పాలన వచ్చింది!

పరాయి పాలన వచ్చింది! ప్ర‌శ్నార్థ‌కంగా తెలంగాణ అస్తిత్వం తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి ఉద్యోగాలు మనవే.....

100 శాతం పంటను కొనాలి

100 శాతం పంటను కొనాలి మద్దతు ధర ప్రకట‌న‌తో బాధ్య‌త పూర్తిన‌ట్లు కాదు వర్షాభావ...

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు డీడీ కట్టినా లోడింగ్‌ పేరుతో అదనపు బాదుడు దొడ్డు...

ఆల‌స్యం త‌ప్ప‌దా..?!

ఆల‌స్యం త‌ప్ప‌దా..?! వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ఇంకా బ్రేకులే ఐదేళ్లుగా సాగుతున్న భారీ నిర్మాణం భవనాలు...

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు...

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న‌ట్లు...

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం రాహుల్‌గాంధీ మాటలు నిజమని తేలింది ఓట్ల తొలగింపుపై...

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌ ఎస్టీ కోటా వ‌ర్తించ‌దంటూ గిరిజ‌న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.