epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
10.75 శాతం వృద్ధితో దేశంలోనే ముందంజ
డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్‌, ఈవీ, ఏరోస్పేస్‌ రంగాల్లో అవకాశాలు
పెట్టుబడులకు 15 రోజుల్లోనే అనుమతులు
డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌
హైదరాబాద్‌ను దక్షిణాదిలో రెండో వ్యాపార కేంద్రంగా మలచుకోండి
గుజరాత్‌ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ఆహ్వానం: మంత్రి శ్రీధర్‌బాబు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : “గుజరాత్‌ నుంచి ఒక్క పెట్టుబడిని, ఒక్క పరిశ్రమను, ఒక్క ఉద్యోగాన్ని కూడా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకోవడం లేదు. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు కొత్త అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. గుజరాత్‌ పశ్చిమ భారతదేశానికి వ్యాపార కేంద్రంగా ఉంటే.. హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశంలో మరో ప్రధాన కేంద్రంగా మలచుకోండి” అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, వేగవంతమైన అనుమతులు, విస్తృత మార్కెట్‌ అవకాశాలున్నాయని వివరించారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్‌, అధునాతన తయారీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఏరోస్పేస్‌, రక్షణ, ఐటీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని గుజరాత్‌ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

పోటీ కాదు.. పరస్పర విస్తరణే లక్ష్యం

డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 సన్నాహాల్లో భాగంగా ఫిక్కీ సహకారంతో మంగళవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార కార్యకలాపాలను తెలంగాణకు విస్తరించాలని కోరారు. గుజరాత్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా అదనపు వ్యాపార కేంద్రంగా తెలంగాణను ఎంచుకోవాలని సూచించారు. వస్త్ర పరిశ్రమలు, వజ్రాల వ్యాపారం, ఔషధ రంగం, ఓడరేవులు, పెట్రోకెమికల్స్‌ వంటి రంగాల్లో భవిష్యత్‌ అవకాశాలను ముందుగానే గుర్తించి గుజరాత్‌ వ్యాపారవేత్తలు విజయాలు సాధించారని కొనియాడారు. ప్రస్తుతం డేటా సెంటర్ల రంగంలోనూ అదే దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అవకాశాలను ఇతరులు గుర్తించకముందే అందిపుచ్చుకుని కొత్త మార్కెట్లలో వ్యాపారాన్ని విస్తరించుకోవడం గుజరాత్‌ పారిశ్రామికవేత్తల ప్రత్యేకతని చెప్పారు.

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. పెట్టుబడులకు కొత్త చిరునామా

హైదరాబాద్‌కు సమీపంలో 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్‌ పారిశ్రామిక, సాంకేతిక పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా నిలవనుందని మంత్రి వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి 25 కిలోమీటర్లలోపు దూరంలో ఉన్న ఈ నగరాన్ని నెట్‌జీరో లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డేటా సెంటర్ల కోసం సుమారు 1,200 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్‌, అధునాతన తయారీ పరిశ్రమలకు మరో 1,200 ఎకరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వ వ్యవస్థల కోసం 800 ఎకరాలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. కృత్రిమ మేధ నగరంతో పాటు 500 ఎకరాల్లో విద్యా కేంద్రాన్ని, 15 వేల ఎకరాలకు పైగా పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్‌ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన మానవ వనరులను సిద్ధం చేసేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ శిక్షణ కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. భూములు సిద్ధంగా ఉన్నప్పుడు, కొత్త పారిశ్రామిక విధానాలు అమల్లోకి వస్తున్న సమయంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భవిష్యత్‌ అవకాశాలను నిర్దేశించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫ్యూచర్‌ సిటీ పూర్తయ్యాక దాని ప్రాధాన్యం అందరికీ తెలుస్తుందని, అయితే గుజరాత్‌ పారిశ్రామికవేత్తలు ఇప్పుడే అక్కడి అవకాశాలను గుర్తించాలని సూచించారు.

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

తెలంగాణ పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ మార్కెట్‌, లాభదాయకత, విశ్వసనీయత అనే మూడు అంశాలను మంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విలువ 189 బిలియన్‌ డాలర్లకు చేరిందని, దేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ వాటా సుమారు ఐదు శాతమని తెలిపారు. గత ఏడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి 10.75 శాతంగా నమోదైందని, తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 1.9 రెట్లు అధికంగా ఉందని వివరించారు. దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్న హైదరాబాద్‌ గుజరాత్‌ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్‌గా ఉందన్నారు. వస్త్రాలు, చీరలు, ఆభరణాలు, సిరామిక్స్‌, ఆహార ఉత్పత్తులు, ఫర్నిచర్‌ వంటి రంగాలకు ఇక్కడ విస్తృత వినియోగదారుల మార్కెట్‌ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,000కు పైగా లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలు, 500కు పైగా గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీటికి రసాయనాలు, ప్యాకేజింగ్‌, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, సేవలు, మౌలిక సదుపరాల అవసరాలు నిరంతరం ఉంటాయని వివరించారు. హైదరాబాద్‌ దక్షిణ భారతదేశంలో కీలకమైన ప్రీమియం గృహ నిర్మాణ మార్కెట్‌గా ఎదిగిందని, గత ఏడాది రూ.10 కోట్లకు పైగా ధర కలిగిన 625 ఇళ్లు విక్రయమయ్యాయని చెప్పారు. న్యూయార్క్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో జీవన వ్యయం ఐదో వంతు మాత్రమేనని పేర్కొన్నారు.

పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

పారిశ్రామిక పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు. పారిశ్రామిక భూములపై 100 శాతం స్టాంప్‌ డ్యూటీ రీయింబర్స్‌మెంట్‌, ఏడేళ్ల వరకు 75 శాతం వరకూ రాష్ట్ర వస్తు సేవల పన్ను రీయింబర్స్‌మెంట్‌, భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, పారదర్శక సేవలు అందించడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. టీజీ-ఐపాస్‌ విధానం ద్వారా భారీ ప్రాజెక్టులకు 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని, సుమారు 98 శాతం అనుమతులను నిర్దేశిత గడువులోనే అందిస్తున్నామని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ప్రతి గుజరాత్‌ కంపెనీకి ప్రత్యేక అధికారిని నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి పరిశ్రమ ప్రారంభించి తొలి విక్రయాలు చేపట్టే వరకు ఆ అధికారి సంస్థకు ఒకే సంప్రదింపు కేంద్రంగా ఉంటారని హామీ ఇచ్చారు.

మూడు ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌–2047 దార్శనికతలో భాగంగా రాష్ట్రాన్ని మూడు ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ, పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ, రూరల్‌ ఆగ్రి రీజియన్‌ ఎకానమీగా విభజించి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే కోర్‌ అర్బన్‌ ప్రాంతంలో ఐటీ, సేవలు, ఆర్థిక రంగం, గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య ఉన్న పెరి అర్బన్‌ ప్రాంతాన్ని తయారీ పరిశ్రమలు, రవాణా-సరఫరా కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు అవతల గ్రామీణ వ్యవసాయ ప్రాంతంలో వ్యవసాయం, ఆహార శుద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని వివరించారు. ఈ మూడు ప్రాంతాలను గుజరాత్‌ కుటుంబ వ్యాపార వ్యవస్థతో పోలుస్తూ.. ఒకటి వ్యాపార కేంద్రం, మరొకటి పరిశ్రమలు, గోదాములు, ఇంకొకటి ముడిసరుకులు, సరఫరా కేంద్రాలుగా పనిచేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించడమే లక్ష్యమన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

డిసెంబరు 7 నుంచి గ్లోబల్‌ సమ్మిట్‌

డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు గుజరాత్‌ పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. ప్రతిపాదిత పారిశ్రామిక నగరాన్ని స్వయంగా సందర్శించి పెట్టుబడి అవకాశాలను పరిశీలించేలా సమ్మిట్‌ను అక్కడే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 100 అంతర్జాతీయ ఏరోస్పేస్‌, రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో రక్షణ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ విధానం–2.0తో పాటు పలు కీలక పారిశ్రామిక విధానాలను ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. గుజరాత్‌ పారిశ్రామిక కుటుంబాలు తమ వ్యాపారాల తదుపరి తరం ప్రతినిధులను కూడా సమ్మిట్‌కు తీసుకురావాలని కోరారు. గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీపడకుండా పరస్పర బలాలను ఉపయోగించుకుని దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనన్న కాంగ్రెస్‌ నేతలు...

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు!

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు! స్థానికత హక్కులు, పదో తరగతి ప్రాధాన్యంపై...

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం!

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం! రాజాసింగ్‌, సీబీఐ విచారణ డిమాండ్‌తో తెరపైకి పాత...

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను!

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను! మూడు గవర్నర్‌ కోటా స్థానాల కోసం కాంగ్రెస్‌లో...

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌!

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌! పాంచజన్య పేరుతో రోజూ పచ్చి అబద్ధాలు తెలంగాణ రక్షణ...

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే!

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే! కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మార్పుతో పార్టీలో...

పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన!

పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన! ఒకేసారి 21 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం హైదరాబాద్‌ సీపీగా...

అటవీ శాఖలో అధికారి పెత్తనం!

అటవీ శాఖలో అధికారి పెత్తనం! వివాదాస్పద వ్యవహారశైలితో సిబ్బందిలో కలవరం రెండు డివిజన్ల బాధ్యతలు.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.