epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?
తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనన్న కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలి
తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం
కాంగ్రెస్‌ మేనిఫెస్టో శతాబ్దపు అతిపెద్ద మోసం
అభయహస్తం పేరుతో అధికారంలోకి వచ్చి రిక్తహస్తం చూపించారు
మూడేళ్లలో పెట్టుబడులు, ఉద్యోగాలు ఎక్కడ?
పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
: బీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలి. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పుకునే నాయకులు ఈ ప్రశ్నకు బదులివ్వాలి. సోనియా గాంధీ ఆత్మలోనూ, గుండెలోనూ తెలంగాణ లేదని, తెలంగాణ రాష్ట్రం ఆమె దయాభిక్ష కాదని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని, కేసీఆర్‌ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమమే దీనికి అసలు కారణమని పేర్కొన్నారు. ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్ర హక్కును కాంగ్రెస్‌ ఉద్యమ చరిత్రను చెరిపివేయడం ద్వారా సొంతం చేసుకోలేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పాలనకు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయమని కేటీఆర్‌ అన్నారు. బహిరంగ సభల్లో ప్రజల స్పందన స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో శతాబ్దపు అతిపెద్ద మోసమని, ఈస్ట్‌మన్‌ రంగుల కలలతో అన్ని వర్గాలను వలలో వేసుకుని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు అభయహస్తం చూపించి, అధికారంలోకి వచ్చాక రిక్తహస్తం ఇచ్చిందని మండిపడ్డారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు

హామీలు అమలు చేయకపోగా తెలంగాణను, రాష్ట్ర నాయకత్వాన్ని అవమానించేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాడీగార్డులా మారిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, పీసీసీ అధ్యక్షుడు, మంత్రి వివేక్‌ రాహుల్‌ గాంధీ బైక్‌ వెనుక పరుగెత్తడం ఏమిటని ప్రశ్నించారు. మూసీలో పది టీఎంసీల నీరు పోస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ నేతలు ఆ నీటిని హైదరాబాద్‌ ప్రజలకు ఎందుకు అందించరని కేటీఆర్‌ ప్రశ్నించారు. కరవు పరిస్థితుల్లో మూసీ సుందరీకరణ అవసరమా అని నిలదీశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో ప్రజలకు తెలుసునని, తగిన సమయంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. చివరి వంద రోజుల్లో మాయ చేస్తే సరిపోతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు వెనక్కి రావడం ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

రైతుల పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు

రాజకీయ కారణాలతో పంపులు ఆన్‌ చేయకపోవడం వల్ల రైతుల పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. దీనికి కాలమే, ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. మేనిఫెస్టోలో 72 శాతం కాంట్రాక్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి కాంట్రాక్టులు ఇచ్చిందో వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మూడేళ్లలో పెట్టుబడులు వచ్చి ఉంటే ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయని, రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎందుకు పడిపోయిందని కేటీఆర్‌ ప్రశ్నించారు. 22-ఏ జాబితా పేరుతో కోటి ఎకరాలను బ్లాక్‌ చేయడం, హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం, పేదల ఇళ్లను కూల్చడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతిందని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కోలుకోలేని పరిస్థితికి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో రెండేళ్లు ఈ పాలనను ఎలా భరించాలా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్‌లో మంచినీటి కొరత లేదని మంత్రి ఉత్తమ్‌ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

వైఫల్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసులు, విచారణల పేరుతో కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ రైజింగ్‌ కాదని, అవినీతి, బంధుప్రీతి, అప్పులు, నేరాల రేటు, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ ఫాలింగ్‌ అవుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన వాస్తవ పెట్టుబడులెన్ని, వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలేంటో వెల్లడిస్తూ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు!

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు! స్థానికత హక్కులు, పదో తరగతి ప్రాధాన్యంపై...

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ 10.75 శాతం వృద్ధితో దేశంలోనే...

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం!

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం! రాజాసింగ్‌, సీబీఐ విచారణ డిమాండ్‌తో తెరపైకి పాత...

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను!

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను! మూడు గవర్నర్‌ కోటా స్థానాల కోసం కాంగ్రెస్‌లో...

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌!

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌! పాంచజన్య పేరుతో రోజూ పచ్చి అబద్ధాలు తెలంగాణ రక్షణ...

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే!

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే! కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మార్పుతో పార్టీలో...

పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన!

పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన! ఒకేసారి 21 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం హైదరాబాద్‌ సీపీగా...

అటవీ శాఖలో అధికారి పెత్తనం!

అటవీ శాఖలో అధికారి పెత్తనం! వివాదాస్పద వ్యవహారశైలితో సిబ్బందిలో కలవరం రెండు డివిజన్ల బాధ్యతలు.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.