epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు!

ఇంటర్‌ బోర్డు రద్దుపై ఎన్నో సందేహాలు!
స్థానికత హక్కులు, పదో తరగతి ప్రాధాన్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఆధారాలు లేకుండా విద్యా విధానంలో మార్పులు ఎలా చేస్తారు?
యాభై ఏళ్ల వ్యవస్థను మార్చే ముందు విస్తృత చర్చ అవసరం
ఇంటర్‌ బోర్డు రద్దుతో విద్యార్థులకు లాభమా? నష్టమా?
భాగస్వాముల అభిప్రాయాలు తీసుకోకుండా ముందుకెళ్లొద్దు
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీనియర్‌ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : “ఇంటర్‌ బోర్డు రద్దు వల్ల స్థానికత అంశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పదో తరగతికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోతుందా? విద్యార్థులకు ఈ నిర్ణయంతో కలిగే ప్రయోజనం ఏమిటి?” అని సీనియర్‌ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ ప్రశ్నించారు. “ప్రజా విధానాలు కచ్చితంగా ఆధారాలతో రూపొందాలి. ఇంటర్‌ బోర్డు రద్దు వల్ల విద్యార్థులకు ఏం లాభం జరుగుతుందో ప్రభుత్వం చెప్పలేకపోతోంది” అని ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. యాభై ఏళ్లుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ విధానంలో మార్పులు చేయాలంటే విస్తృత స్థాయిలో చర్చ జరగాలని, ప్రభావితమయ్యే వర్గాల సందేహాలకు సమాధానాలు చెప్పాలని వారు స్పష్టం చేశారు. ‘ఇంటర్‌ బోర్డు రద్దు-తెలంగాణ విద్యపై ప్రభావం’ అంశంపై టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత సమావేశానికి ప్రారంభ, ముగింపు ప్రసంగాలు చేశారు.

అనుమానాలు నివృత్తి చేయాలి: కె. శ్రీనివాస్, సీనియర్ ఎడిటర్

ఇంటర్ బోర్డు రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో చాలా అనుమానాలున్నాయని సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్ అన్నారు. ఇంటర్ బోర్డు రద్దు కారణంగా తలెత్తే స్థానికత అంశంతో పాటు పదో తరగతికి ఉండే ప్రాధాన్యాన్ని తగ్గిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని మార్చాలంటే విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ఈ అనుమానాలకు సమాధానం చెప్పకుండా ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటే అంగీకరించేది లేదన్నారు.

పబ్లిక్ పాలసీ ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలి- ప్రొఫెసర్ కె. నాగేశ్వర్

ఏదైనా పబ్లిక్ పాలసీ అంటే కచ్చితంగా అది ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. కానీ ఇంటర్ బోర్డు రద్దు కారణంగా ఏం లాభం జరుగుతుందన్నది ప్రభుత్వం చెప్పలేకపోతోందన్నారు. జాతీయ విధానంలో ఉంది కనుక మనం కూడా అలాగే కొనసాగిద్దామనే విధానం సరికాదని చెప్పారు. ఇంటర్ బోర్డు రద్దు కారణంగా విద్యార్థులకు లాభమా? నష్టమా అన్నది ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రభావితమయ్యే జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ విద్యార్థుల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా స్టేక్ హోల్డర్లతో చర్చించి నిర్ణయాలు ప్రకటించాలన్నారు.

పీవీ తెచ్చిన విధానాన్ని రద్దు చేయాలనే- మధుసూదన్ రెడ్డి ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్

ఇంటర్ బోర్డు రద్దు కారణంగా ప్రయోజనం ఏంటన్నది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధికారికంగా చెప్పలేదని ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధు సూదన్ రెడ్డి మండిపడ్డారు. కేవలం మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు ఈ విధానాన్ని తెచ్చారని..ఆయన ఆనవాళ్లు ఉండవద్దనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేస్తున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. అసలు ఈ ప్రభుత్వానికి విద్య విధానం పై ఒక దిశ, దశ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఇంటర్మీడియేట్ విధానం తెలంగాణ, ఏపీల్లోనే ఉందంటూ ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇంటర్మీడియేట్ విద్యా విధానం ఉందన్నారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై మరోసారి ఆలోచించి అందరితో చర్చించాకే ముందుకు వెళ్లాలని సూచించారు.

డైవర్షన్ రాజకీయాల కోసమే- పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్

ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రి డైవర్షన్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. లేదంటే ఒక్క ఏడాది లో ఇంటర్ బోర్డు రద్దు చేసి విద్యాశాఖలో కలపటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏడాదిలో ఇంటర్ బోర్డును రద్దు చేస్తే కచ్చితంగా అది సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు.

మహేందర్ రెడ్డి, కనిష్క కోచింగ్ అకాడమీ ఛైర్మన్

విద్య అనేది ప్రభుత్వానికి సంబంధించిన సామాజిక బాధ్యత అని కనిష్క కోచింగ్ అకాడమీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి చెప్పారు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం నెమ్మదిగా ఆ బాధ్యతను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ఇంటర్ విద్యను కార్పొరేటీకరణ చేసేశారన్నారు. ఇప్పుడు ప్రాథమిక, సెకండరీ విద్యను కూడా వాళ్లపరం చేసే విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పరమైన ఇంటర్ బోర్డును ఉంచిన తీసేసిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ముందు కార్పొరేట్ చేతిలో బందీ అయిన ఇంటర్ విద్యను ప్రభుత్వం అధీనంలోకి తెచ్చినప్పుడే మంచి జరుగుతుందన్నారు.

చర్చించకుండా ఎలా నిర్ణయిస్తారు? : క‌విత‌

ఇంటర్‌ బోర్డు రద్దు నిర్ణయం తెలంగాణ విద్యార్థుల స్థానికత హక్కులకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాసంస్థలకు అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులు హైదరాబాద్‌లో పరీక్షలు రాసి స్థానికులుగా చెలామణి అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. చంద్రబాబు మెప్పు పొందేందుకు ఆంధ్రా ప్రజలకు మేలు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇంటర్‌ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి పరిపక్వత లేని చిన్నపిల్లాడిలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కవిత మండిపడ్డారు. గతేడాది ఇంటర్‌ బోర్డు రద్దు చేస్తామని ప్రకటించిన తర్వాత అధికారులు అడ్మిషన్లు కొనసాగుతాయని చెప్పారని గుర్తుచేశారు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని భావించామని, ఇప్పుడు మళ్లీ బోర్డు రద్దు ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారని అన్నారు. అఖిలపక్షం, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించకుండా లక్షలాది మంది భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బోర్డు రద్దయితే జూనియర్‌ లెక్చరర్లు, కళాశాలల పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాలని కోరారు.

ఆధారాలు చూపాలని డిమాండ్‌

ఇంటర్‌ బోర్డును విద్యాశాఖలో విలీనం చేయడం విఫల ప్రయోగమని ఆంధ్రప్రదేశ్‌ అనుభవం స్పష్టం చేస్తోందని కవిత అన్నారు. ఏ సంస్కరణ చేపట్టినా దానికి నిరూపితమైన ఆధారాలు ఉండాలని పేర్కొన్నారు. డ్రాపౌట్లను కారణంగా చూపుతూ బోర్డును రద్దు చేయడం సరికాదని, డ్రాపౌట్లు ఉంటే వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రభుత్వం బిల్లు తీసుకురావాలని భావిస్తే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, ప్రతి జిల్లాలో ముసాయిదాను అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు రద్దు వల్ల విద్యార్థులకు ఏ విధంగా మేలు జరుగుతుందో ప్రభుత్వం వివరించాలని అన్నారు. ఇంటర్‌ బోర్డును విద్యాశాఖలో విలీనం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమైతే కేరళ విధానాన్ని పరిశీలించాలని కవిత సూచించారు. అక్కడ పదేళ్లపాటు అవసరమైన నిధులు కేటాయిస్తూ దశలవారీగా మార్పులు చేపట్టారని వివరించారు. తెలంగాణలోనూ భాగస్వాములందరితో చర్చించి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే మూడేళ్ల నుంచి పదేళ్ల వ్యవధిలో అమలు చేయాలని అన్నారు. పరిపాలనా సంస్కరణలనే విద్యా సంస్కరణలుగా భావించవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్‌ పాలనలో ఐసీయూలో ఉన్న విద్యావ్యవస్థ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిందని విమర్శించారు. తెలంగాణలో అందరికీ విద్య అందాలన్నదే తమ సంకల్పమని, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఐక్య పోరాటాలతో అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అశోక్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ, శివరాత్రి యాదగిరి, ట్రస్మా అధ్యక్షుడు, ఎస్‌. నాగేశ్వర్‌, జార్జ్‌రెడ్డి పీడీఎస్‌యూ, విజయ్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు, మధుసూదన్‌, ట్రస్మా ఛైర్మన్‌, సాయికుమార్‌, టీఎస్‌కేవీ, వెంకట్‌ సాయినాథ్‌, హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌, రాజ్‌కమల్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, సురేష్‌బాబు, కృష్ణలత, రవి, మొహన్‌కుమార్‌, రంజిత్‌, ఝాన్సీ తదితరులు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. భాగస్వాములందరితో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ?

సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏదీ? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనన్న కాంగ్రెస్‌ నేతలు...

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

189 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ 10.75 శాతం వృద్ధితో దేశంలోనే...

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం!

సజ్జనార్‌ చుట్టూ ఆరోపణల వలయం! రాజాసింగ్‌, సీబీఐ విచారణ డిమాండ్‌తో తెరపైకి పాత...

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను!

ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను! మూడు గవర్నర్‌ కోటా స్థానాల కోసం కాంగ్రెస్‌లో...

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌!

కవిత వెనుక రేవంత్‌ స్క్రిప్ట్‌! పాంచజన్య పేరుతో రోజూ పచ్చి అబద్ధాలు తెలంగాణ రక్షణ...

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే!

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే! కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మార్పుతో పార్టీలో...

పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన!

పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన! ఒకేసారి 21 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం హైదరాబాద్‌ సీపీగా...

అటవీ శాఖలో అధికారి పెత్తనం!

అటవీ శాఖలో అధికారి పెత్తనం! వివాదాస్పద వ్యవహారశైలితో సిబ్బందిలో కలవరం రెండు డివిజన్ల బాధ్యతలు.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.