epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు

భట్టి డైరెక్షన్ లో సీపీ కట్టుకథలు
​అసలు హంతకులను కాపాడేందుకు సీపీ సునీల్ దత్ డ్రామా
ప్రజా భవన్‌లో స్క్రిప్ట్ తయారు చేసి.. సీపీ అమలు
​రామారావు మర్డర్ ను పక్కదారి పట్టించే కుట్ర
​బాధితులకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క డైరెక్ష‌న్‌లోనే సామినేని హ‌త్య‌కు సంబంధించిన ద‌ర్యాప్తును ఖ‌మ్మం సీపీ సునిల్ ద‌త్ పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆరోపించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామారావు హత్యలో అసలు హంతకులను, రౌడీలను, గూండాలాను కాపాడేందుకు పోలీస్ కమిషనర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే రామారావు రిమాండ్ రిపోర్ట్ లో 14 మంది సాక్షులను విచారించామని చెప్పినప్పటికీ, అందులో ఇద్దరు ఉద్యోగులు మినహా మిగిలిన వాళ్ళంతా వేరే పేర్లు చెబుతున్నారని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క చెబితే సీపీ సునీల్ దత్ ఈ కట్టు కధ అల్లుతున్నారని విమర్శించారు. హత్య వెనుక అసలు మోటివ్ ను పక్కన పెట్టి, సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తూ తప్పుడు కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. రామారావు హత్యకు కారణమైన హంతకులను శిక్షించే వరకు అసలు దోషులు పట్టబడే వరకు సీపీఎం పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని, రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.సీపీ ఖమ్మం జిల్లా ప్రజల ముందు పెద్ద నాటకం చూపించారని అన్నారు. భట్టి మధిర నియోజకవర్గం లో హత్యాకాండ ద్వారా రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు సీపీఎం కు చెందిన ముగ్గుర్ని హత్య చేశారని చెప్పారు. భట్టి అన్యాయాలు,అవినీతిని, అక్రమాలు ప్రశ్నించినందుకే సామినేని రామారావు ను హత్య చేశారని ఆరోపించారు.హత్యకు నెల రోజుల ముందు రామారావు పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారని పేర్కొంటూ అ సందర్బంగా రామారావు ప్రసంగం ఆడియో ను విలేకరులకు వినిపించారు. భట్టికి సీపీ మొదట నుంచి ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాభవన్ లో భట్టి సమక్షంలో తయారు చేసిన స్క్రిప్ట్ ను సీపీ అమలు చేస్తున్నారని, కానీ నాటకం అట్టర్ ప్లాప్ కాక తప్పదని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి భట్టి డైరెక్షన్ లో జ్ఞానేష్ కుమార్ లాంటి సీపీ అన్యాయానికి తెర లేపారని విమర్శించారు. ఫోరెన్సిక్ టెస్ట్ కు రాలేదని నేరస్తులు అనడం సరికాదన్నారు. సీపీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. హంతకులను పట్టుకునే దాకా సీపీఎం ఎవర్ని వదిలి పెట్టదని, పెద్ద ఎత్తున పోరాడుతుందని, న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు. పొలిటికల్ మర్డర్ అంటున్న సీపీ 10 జన్మ లెత్తినా ఈ కేసును తేల్చలేరని అన్నారు. భట్టి ప్రోత్సాహంతోనే రామారావు ను హాత్య చేశారన్నది వాస్తవమని అన్నారు. ఆర్థిక వ్యవహారాలు కూడా కారణమంటున్నారని, ఛాలెంజ్ చేస్తున్నామని,అధికారంలో వారే ఉన్నారని, అవేమిటో తెల్చాలని డిమాండ్ చేశారు.

సీపీని తక్షణమే సస్పెండ్ చేయాలి : నున్నా నాగేశ్వరరావు

సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ​ఖమ్మం జిల్లాలో ఐపీఎస్ వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న పోలీస్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామారావు హత్య కేసులో ఏడాది గడిచినా హంతకులను అరెస్ట్ చేయకుండా, పోలీసు శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీపీ కొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. సీఎంను కలిసి సిట్ ప్రత్యేక దర్యాప్తు కోరినా ఫలితం లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా భట్టి అడ్డుకున్నారని ఆరోపించారు. సీపీ చెబుతున్న అబద్ధపు కథలను రామారావు కుటుంబ సభ్యులు, ప్రజలు, చివరికి పోలీసు అధికారులే నమ్మలేక నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ సీపీని వెంటనే సస్పెండ్ చేసి, సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులను చట్టం ముందు నిలబెట్టే వరకు సీపీఎం ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు. సీపీ ఉద్దేశ పూర్వకంగా నేరస్తులను పట్టుకోకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. రామారావు భార్య గుర్తు పట్టి కొందరి పేర్లు చెప్పినా వారిని విచారించలేదన్నారు. సీఎం ను, డీజీపీ ని కలిసి, సిట్ విచారణ కోరతామన్నారు. సీపీ ని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా కోరతామన్నారు. న్యాయపోరాటం చేసి, ఆసలు హంతకులను, వారిని రక్షించే అధికారులను కూడా బోను లో నిలబెడతామన్నారు.విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బండి పద్మ, కళ్యాణం వేంకటేశ్వరరావు, మాదినేని రమేష్, విక్రమ్, పార్టీ సీనియర్ నాయకులు చింతలచెర్వు కోటేశ్వరరావు,మధిర డివిజన్ కార్యదర్శి ఎం. గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యాసంగిలో వరి సాగు వద్దు!

యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి...

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు...

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి :...

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంచాలి నవంబర్‌ నుంచి...

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు...

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన కాకతీయ, ఖమ్మం :...

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి మాజీ...

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌ చిన్నజీయర్‌ స్వామీజీని ఆహ్వానించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.