జోరందుకోనున్న తెలంగాణ జనసేన!
సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘అలయ్ బలాయ్’
పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు కార్యాచరణ
నూతన నాయకత్వానికి బాధ్యతలు.. పార్టీ పురోగతిపై సమీక్ష
జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమ్మేళనం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసి, రాబోయే ఎన్నికలకు పటిష్ఠంగా సిద్ధం కావడమే లక్ష్యంగా నిర్వహించిన ‘అలయ్ బలాయ్’ ఆత్మీయ సమ్మేళనం సంస్థాగత కార్యాచరణకు వేదికగా నిలిచింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ముఖ్య అతిథిగా, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్‌గౌడ్, ప్రచార కార్యదర్శి ఆర్.కె. సాగర్ అతిథులుగా హాజరయ్యారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులను పరిచయం చేసి, వారి రాజకీయ అనుభవం, ప్రజాసంబంధాలు, సామర్థ్యాలను పార్టీ బలోపేతానికి వినియోగించుకునే అంశాలపై చర్చించారు. ఇప్పటికే పనిచేస్తున్న నాయకులు, నూతనంగా చేరినవారు సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

పార్టీ ప్రస్థానంపై సమీక్ష
జూన్ 2 నుంచి తెలంగాణలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై చేపట్టిన పోరాటాలు, జిల్లాలవారీగా సాధించిన సంస్థాగత పురోగతిని సమీక్షించారు. గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నాయకుల మధ్య సమన్వయం, సమాచార వ్యవస్థ బలోపేతం, బాధ్యతల విభజన, జవాబుదారీతనంతో పనిచేయడంపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, రాజలింగం, దామోదర్‌రెడ్డి, మచ్చ సుధాకర్, సంపత్ నాయక్, ప్రజిత్ గౌడ్, రాము యాదవ్, మండపాక కావ్య, మాధవ్‌రెడ్డి, మేడ రామకృష్ణ, చిన్నతిమ్మప్ప, శ్రీధర్ శర్మ, మంథని సంపత్, దాసరి రావీష్, ప్రేమ్ గాంధీ, గోకుల రవీంద్రరెడ్డి, డా. పద్మావతి, జై సింహ పడాల, నిహారిక నాయుడు, తనూజ రెడ్డి, సురేష్‌రెడ్డి, మణికంఠ గౌడ్, ఫరీద్, నందగిరి సతీష్, స్వాతి రెడ్డి, ఎడమ రాజేష్, లక్ష్మణ్ గౌడ్, దుర్గ ప్రసాద్, హరీష్ గౌడ్, రవీంద్ర గౌడ్, కరాటే ప్రభాకర్, బెక్కం జనార్ధన్, శివారెడ్డి చల్ల, వినయ్ విప్లవ్, వంగరి సాయి కుమార్, ఆంజినేయులు గౌడ్, హసీనా, సాయి కీర్తి, సంతోష్ నాయక్, డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, డాక్టర్ బండారి రాజ్‌కుమార్, డాక్టర్ ప్రియా, సుదర్శన్‌రెడ్డి, దాసరి పవన్, డాక్టర్ రవికుమార్, శివ కార్తీక్ నాయుడు, వెంకట్ ప్రజాపతి, రుద్ర శ్రీనివాస్, అనుపమ తదితరులు పాల్గొన్నారు.


