epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె
ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలి
పని భారం తగ్గించి రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందించాలి
 సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్‌
కాకతీయ, హనుమకొండ : ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 15 నుంచి సీఐటీయూ, బీఆర్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు రాగుల రమేష్‌ తెలిపారు. ఆశాలకు ఫిక్స్‌డ్‌ వేతనం అమలు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని, పని భారం తగ్గించాలని కోరుతూ బుధవారం జిల్లా వైద్యాధికారికి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్వోకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా రాగుల రమేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయలేదని విమర్శించారు. వేతనాల పెంపు కోసం అనేక సందర్భాల్లో ఆందోళనలు, పోరాటాలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. వేతనాలు పెంచకపోగా అదనపు పనిభారం మోపుతూ ఆశా వర్కర్లతో అధిక పని చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు కల్పించాలి
ఆశా వర్కర్లకు రూ.50 లక్షల జీవిత బీమా కల్పించాలని, మరణించిన సందర్భంలో అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.50 వేలు ఇవ్వాలని రమేష్‌ డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌గా రూ.5 లక్షలు చెల్లించాలని, పదవీ విరమణ అనంతరం చివరిగా పొందిన పారితోషికంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా ఇవ్వాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించడంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సమ్మె సన్నాహాల్లో భాగంగా నవంబర్‌ 16న ఆశా వర్కర్లు చేపట్టనున్న జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాగుల రమేష్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా కన్వీనర్‌ కోఆర్డినేటర్‌ నాయిని రవి, ఆశా యూనియన్‌ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు చుంచు రాజేశ్వరి, సీహెచ్‌ శ్రీవాణి, జే. శ్వేత, జి. పొదిలి, నవమణి, అరూరి లత, బీఆర్టీయూ ఆశా యూనియన్‌ నాయకులు బండారి మంజుల, ప్రేమలత, సుజాత, కవిత, లావణ్య, విజయ, తిరుమల, నిర్మలతో పాటు పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌! గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌...

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి!

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ ఓటు...

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరలో తహసీల్దార్‌  భవనం పూర్తి...

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు 

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు  బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్  కాంగ్రెస్...

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి! రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నమోదు ప్రక్రియ అర్హులంతా...

గీసుగొండ కాంగ్రెస్‌ పూర్తి కమిటీ ప్రకటన!

కాంగ్రెస్ పార్టీ మండల పూర్తి కమిటీ ప్రకటన... మండల కమిటీలో యువతకు ప్రాధాన్యత... మహిళా,...

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం!

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం! అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించడం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.