epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిరుద్యోగుల కన్నీళ్లు తెలిసిన వాడిని!

నిరుద్యోగుల కన్నీళ్లు తెలిసిన వాడిని!
పారాచూట్ లీడర్‌ను కాదు..ఆద‌రించండి
13 ఏళ్లుగా నిరుద్యోగుల మధ్యే నా ప్రయాణం
ఎన్నికలప్పుడే సమస్యలు గుర్తుకొచ్చే వారికి పట్టభద్రులే బుద్ధి చెబుతారు!
నాలుగు గోడల మధ్య నిరుద్యోగుల కన్నీటి వ్యథలను చూశా
ప్రత్యర్థులపై మెండేం కిరణ్ కుమార్ నిప్పులు
వ‌రంగ‌ల్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఘాటు వ్యాఖ్యలు

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : స్వలాభం కోసం ఎన్నికల సమయంలో ప్రత్యక్షమై పట్టభద్రుల ఓట్లు పొందాలని చూసే పారాచూట్ నాయకుడిని తాను కాదని, 13 ఏళ్లుగా నిరుద్యోగ యువత మధ్య ఉంటూ వారి సమస్యలు, ఆవేదనలు, కన్నీళ్లను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తినని నల్గొండ– వరంగల్– ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మెండేం కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. కోట్ల రూపాయల లాభాలు, వ్యాపార టర్నోవర్లు సంపాదించే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు నిరుద్యోగుల కుటుంబాల్లోని కన్నీటి వ్యథలు కనిపించవని, ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఎన్నో ఆశలు, కలలతో జీవిస్తున్న యువత వేదన తనకు తెలుసని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలు గుర్తుకొచ్చే నాయకులకు ఈసారి పట్టభద్రులే తమ ఓటుతో బుద్ధి చెబుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. హన్మకొండలోని గోకుల్ నగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్‌లో శుక్రవారం మెండేం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం, ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది పట్టభద్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడారు.

నిరుద్యోగుల‌కు ఆశ‌లు చూపుతున్న‌రు..

అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎన్ఆర్ఐలుగా విదేశాల్లో ఉంటూ కోట్లాది రూపాయల సంపద కూడబెట్టుకుని, ఇప్పుడు ఆ ఆర్థిక బలాన్ని నిరుద్యోగుల ఆశలకు పెట్టుబడిగా వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. తాను మాత్రం సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, నిరుద్యోగుల కష్టాలను, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను, ఉద్యోగం సాధించాలన్న వారి తపనను దగ్గరగా అర్థం చేసుకున్నానని తెలిపారు. నిరుద్యోగుల బాధలను కేవలం ప్రసంగాలకే పరిమితం చేయకుండా రైట్ చాయిస్ అకాడమీ ద్వారా వారి ఉద్యోగ కలలను నిజం చేసే దిశగా రేయింబవళ్ళు శ్రమించానని పేర్కొన్నారు. విదేశాల్లో సంపాదించిన కోట్ల రూపాయలతో నిరుద్యోగుల ఆశలను కొనలేరని, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ, నిరంతర ప్రజా సంబంధాలే నాయకత్వానికి అసలైన కొలమానాలని స్పష్టం చేశారు. తన 13 ఏళ్ల ప్రయాణం పదవులు, రాజకీయ ప్రయోజనాల చుట్టూ తిరగలేదని, నిరుద్యోగుల సమస్యలు, వారి భవిష్యత్తు కోసమే సాగిందని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కుటుంబాల బాధ్యతలు మోస్తున్న యువత మనోవేదనను ప్రత్యక్షంగా చూశానని, నాలుగు గోడల మధ్య వారు పడే కన్నీటి కష్టాలు తనకు తెలుసునని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావించి, ఆ తర్వాత వారిని విస్మరించే నాయకుల మాటలను పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

ఈ ఎన్నిక రాజకీయ పలుకుబడికి వేదిక కావొద్దు

పట్టభద్రుల ఎన్నికలు డబ్బు, ఆర్భాటాలు, రాజకీయ పలుకుబడికి వేదిక కాకూడదని, నిరుద్యోగుల భవిష్యత్తు, పట్టభద్రుల హక్కులు, ఉద్యోగ అవకాశాల కోసం నిరంతరం పనిచేసే నాయకత్వాన్ని గుర్తించాలని కిరణ్ కుమార్ కోరారు. ఈ సమ్మేళనంలో పట్టభద్రులతో ఆత్మీయంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలనే లక్ష్యంతో ప్రత్యేక ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది పట్టభద్రులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జేఏసీ నేతలు చెర్రీ ప్రవీణ్, నవీన్ పట్నాయక్, బాలకోటి, మిత్ర, స్మార్ట్ ప్రవీణ్, శింబు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అభిరామ్, చందు, ఖజురో పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హుజురాబాద్‌లోనూ బైపోల్‌..?!

హుజురాబాద్‌లోనూ బైపోల్‌..?! మరో బైపోల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి హింట్‌ ఖైరతాబాద్‌తో పాటే ఉంటుంద‌ని...

దానం దారెటు..?

దానం దారెటు..? సుప్రీం తలుపు త‌ట్టిన దానం నాగేంద‌ర్‌ కేవియట్ పిటిష‌న్లు దాఖ‌లు చేసిన‌...

వనమా ఇంట్లో వారసత్వ వార్‌!

వనమా ఇంట్లో వారసత్వ వార్‌! కూతురి కోసం రాఘవ పట్టు.. మనవడి కోసం...

మా వాటా మాకివ్వండి

మా వాటా మాకివ్వండి రాజ్యాధికారం సాధ‌నే బీసీల అభివృద్ధికి మార్గం జ‌న‌ర‌ల్ సీటు అంటే...

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ

మేడ్చల్ డీసీసీపై కసరత్తు షురూ రంగంలోకి టీపీసీసీ పరిశీలకులు జనవరి 1 వరకు క్షేత్రస్థాయిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.