ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!
నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో కులదైవానికి నివాళులు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కులదైవం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దడిగల సమ్మయ్య, మల్యాల రాంచందర్, మండల అధ్యక్షుడు దడిగల నరసింహులు, ఉపాధ్యక్షుడు దడిగల రాజారామ్, కార్యదర్శి వెలకంటి శ్రీను, కోశాధికారి శ్రీరాముల చంద్రశేఖర్, మండల గౌరవ అధ్యక్షుడు దడిగల సత్యనారాయణ, దడిగల వెంకన్నతోపాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

