ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి
శ్రీరామగిరిలో పంట మార్పిడిపై అవగాహన సదస్సు
కాకతీయ, నెల్లికుదురు : ఎల్ నివొ ప్రభావంతో వర్ష బావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని ఏవో మహేందర్ గ్రామ సర్పంచ్ మాదర్ ప్రశాంత్ లు అన్నారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల వల్ల వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, పంట మార్పిడి విధానాలను అవలంబించాలని సూచించారు. ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుంటూ నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్, ఏ ఈ ఓ ప్రతిభ, పంచాయతీ సెక్రటరీ మౌనిక, పిఎసిఎస్ సెక్రటరీ కత్తుల వెంకన్నా, పిఎసిఎస్ డైరెక్టర్స్ మద్దెల సమ్మయ్య, బెల్లి నర్సయ్య, గ్రామ రైతులు, అనుముల రవీందర్, బొమ్మిడీ వినోద్ రెడ్డి,గుర్రాల నరేష్, పోతారాజ్ యాకన్నా తదితరులు పాల్గొన్నారు.

