పేదలకు అండగా సియం సహాయ నిధి.ఏమ్మెల్యే యశస్విని రెడ్డి
కాకతీయ, పెద్దవంగర : నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఏమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు మంజూరైన సియం సహాయ నిధి చెక్కలను గురువారం ఏమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చులు తీవ్ర ఆర్థిక భారంగా మారుతున్నాయని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి బాధిత కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందన్నారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ వైద్య చికిత్సకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.ఈ
కార్యక్రమంలో మండల అధ్యక్షులు రంగు మురళి, సీనియర్ నాయకులు నెహ్రూ నాయక్,నాయకులు రామకృష్ణ రెడ్డి, దాసరి శ్రీనివాస్, పన్నీరు వేణు, యూత్ అధ్యక్షులు బీసు హరికృష్ణ, సీతారాం నాయక్,పలు గ్రామ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

